కలెక్షన్లు లేవు కానీ.. బడ్జెట్లు మాత్రం 100 కోట్లట

Telugu young heroes high budget films struggling at box office

ఒకపక్క మన పక్క రాష్ట్రం కేరళ 10 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతుంటే.. తెలుగు చిత్రసీమ మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టి, కనీసం 50 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించలేకపోతుంది. మరీ ముఖ్యంగా కొందరు యంగ్ హీరోస్ తమ ప్రతి సినిమాకి బడ్జెట్ మినిమం 100 కోట్లు ఉండాలని నిర్మాతలకి ఇస్తున్న ప్రెజర్ కి, వాళ్లు భవిష్యత్తులో ప్రొడక్షన్ ఆపేసి వెళ్లిపోయేలా చేస్తుంది.

అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్స్ నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అడివి శేష్ లు. వీళ్లల్లో ఏ ఒక్కరికీ ఇప్పటివరకు 100 కోట్ల షేర్ సినిమా అనేది లేదు. కానీ.. వాళ్ల రాబోయే సినిమాల బడ్జెట్లు అన్నీ దాదాపుగా 100 కోట్లు. నాని “ప్యారడైజ్”, విజయ్ దేవరకొండ “రణబాలి”, నాగచైతన్య “వృషకర్మ”, అడివి శేష్ “G2” వంటి సినిమాలన్నీ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే.

ADVERTISEMENT

ఈ లిస్టులో నాగచైతన్య ఒక్కడే 100 కోట్ల గ్రాస్ కొట్టాను అనిపించుకున్నాడు కానీ.. బన్నీ వాసు మాత్రం దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. మిగతా హీరోల ప్రీవియస్ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ ఏమిటి అన్నది తెలిసిందే.

ఇలాంటి సమయంలో హీరోలు బడ్జెట్ ను కంట్రోల్ చేసి నిర్మాతల్ని కాపాడాలి కానీ.. క్రియేటివిటీ అంటూ నిర్మాతల పాలిట విలన్లుగా మారకూడదు. ఎంత ఓటీటీ, డిజిటల్ రైట్స్ రూపేణా నిర్మాతలు సంపాదిస్తున్నా.. థియేట్రికల్ కలెక్షన్స్ అనేవి పడిపోవడంతో నిర్మాతలకి చివరికి వచ్చేసరికి పెద్దగా మిగలడం లేదు. మరి ఈ విషయమై కనీసం యువ హీరోలైనా ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని.. బడ్జెట్ ను నియంత్రించి, నిర్మాతలను కాపాడుకుంటే బెటర్.

ADVERTISEMENT
Latest Stories