హస్తినలో ‘ఏకలవ్య’ నిరసన…!

Lady Protest

ఏపీ రాజకీయాలు నానాటికి ఎంతలా దిగజారిపోతున్నాయి అనడానికి దేశ రాజధాని హస్తినలో జరిగిన తాజా ఘటనే సజీవ సాక్షిగా మిగిలింది. గుంటూరు కు చెందిన కోవూరు లక్ష్మీ అనే మహిళ ఆదివారం సాయంత్రం ఇండియా గేటు వద్ద ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని అందుకు నిరసనగా తన ఎడమ చేతి బొటన వేలు నరుక్కుని నిరసన తెలియచేసారు.

గుంటూరు జిల్లా పత్తిపాడు నియాజకవర్గంలో మాజీ హోమ్ మంత్రి సుచరిత ఆమె అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారని, గంజాయి, అక్రమ ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాలకు పాల్పడుతున్నారని తన నిరసన గళం వినిపించారు లక్ష్మీ. ఏపీలో వైసీపీ నాయకుల అరాచకాలు ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీం కోర్ట్, సీజేఐ దృష్టికి తీసుకు వెళ్లేందుకే ఇటువంటి ‘ఏకలవ్య’ నిరసన చేపట్టాల్సి వచ్చిందంటూ తన ఆవేదన వ్యక్తం చేసారు.

ADVERTISEMENT

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం పై కనీస నిరసన తెలిపే హక్కు గాని, ప్రశ్నించే స్వేచ్ఛ కానీ లేకపోవడం వల్లనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రశించిన వారి పై కేసులు పెట్టడం, మాట వినని వారిని జైలుకు పంపడం వైసీపీ ప్రభుత్వంలో పరిపాటిగా మారిపోయిందంటున్నారు టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో నిన్న భీమవరం సభలో పవన్ ప్రసంగం వైరల్ అయ్యింది.

త్వరలో ఏర్పడబోయే ఎన్డీయే ప్రభుత్వంలో ముందుగా రాష్ట్రానికి కావాల్సింది, రావాల్సింది స్వేచ్ఛ అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకపోవడంతో లక్ష్మీ అనే మహిళా దేశ రాజధాని దాక వెళ్లారు అంటూ పవన్ వ్యాఖ్యలను జత చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని లేని ఎక్కైక రాష్ట్రంగా దేశ ప్రజల ముందు తలవంచిన ఏపీ ఇప్పుడు ఇటువంటి ఘటనలతో మరోసారి తలవంచక తప్పదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అస్త్ర విద్యలలో గురువైన ద్రోణాచార్యుని దగ్గర శిక్షణ అభ్యసించడానికి వీలుపడక ఆయన ప్రతిమతో ధనుర్విద్యలో నైపుణ్యం సాధించిన ఏకలవ్యుడు అనే యువకుడి దగ్గర నుండి అర్జునిడి కోసం ఆయన బొటన వేలును గురు దక్షిణగా అడుగుతారు ద్రోణాచార్యులు. అయితే తన గురువు కోరిక తీర్చడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించక తన బొటన వేలుని గురు దక్షిణ గా సమర్పిస్తారు ఏకలవ్యుడు.

అయితే అక్కడ గురువు మీద ప్రేమతో దక్షిణ గా బొటన వేలు కోసుకుంటే ఇక్కడ రాష్ట్రానికే గురువు స్థానంలో ఉన్న వైసీపీ దాష్టికాలకు నిరసనగా కోపంతో బొటన వేలు కోసుకున్నారు లక్ష్మీ. అక్కడ ఏకలవ్యుని ప్రేమ కనపడితే…ఇక్కడ ఏకలవ్యుని క్రోధం అగుపిస్తుంది. మరి లక్ష్మీ నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెపుతుందా..? కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా..?

ADVERTISEMENT
Latest Stories