2020 వేసవికి తలపతి64

Thalapathy64-first-official-mass-announcement---check-it-out!ఇళయ తలపతి విజయ్ తన తదుపరి చిత్రం, బిజిల్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈలోగానే ఆయన తదుపరి చిత్రం తలపతి 64 ప్రకటించారు. గతంలో రెండే సినిమాలకు దర్శకత్వం వహించిన లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ఈ సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ లో షూటింగ్ మొదలు పెట్టబోతోంది. 2020 వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి టీం ప్రణాళికలు రచిస్తోంది.

2020 ఏప్రిల్ లో తమిళ ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా. విజయ్‌ కి జోడీగా రష్మిక, త్రిష, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. అయితే నిర్మాతలు మాత్రం ఈరోజు సినిమాలో నటించే హీరోయిన్ పేరు ప్రకటించలేదు. ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం సమకూర్చుతున్నారు. విజయ్‌ బంధువు గ్జేవియర్‌ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవలం 50 రోజుల్లోనే మొత్తం చిత్రం షూటింగ్ పూర్తి చేసేలా పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారట.

ADVERTISEMENT

వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో ఉన్నాడు విజయ్‌. ప్రతీ సినిమాకు తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ పోతున్న విజయ్‌, సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నాడు. బిజిల్ కు స్టార్ దర్శకుడు, అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు యువ దర్శకుడితో పని చేస్తున్నాడు. మరి ఈ రెండు రకాల దర్శకులతో కూడా విజయ్ హిట్ కొట్టగలడేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories