టీజర్ ప్రోమో – థమన్ బ్యాక్ గ్రౌండే హైలైట్!

thaman back ground music Sketch Teaser Promo ఇటీవల కాలంలో సంగీత దర్శకుడిగా సెన్సేషన్ గా మారుతున్న పేరు ఎస్.ఎస్.థమన్. తనలోని విలక్షణతను ప్రతిబింబించే విధంగా వినూత్నమైన సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ… టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారుతున్నాడు. ఇప్పటికే ‘మహానుభావుడు’ ద్వారా అదిరిపోయే ఆల్బమ్ ను అందించిన థమన్, మరో వైపు ‘రాజు గారి గది 2’తో తనలోని హార్రర్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.

ADVERTISEMENT

ఇలా మాంచి దూకుడు మీద వెళ్తున్న థమన్ “స్కెచ్” సినిమాతో యాక్షన్ ఎంటర్టైనర్ కు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ‘చియాన్’ విక్రం, తమన్నా జంటగా నటించిన “స్కెచ్” ప్రోమోను విడుదల చేయగా, అందులో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే హైలైట్ అయ్యింది. విక్రం గన్ పేల్చినట్లుగా ఉన్న ఈ ప్రోమోలో, ఆ తర్వాత నుండి థమన్ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే వినిపిస్తుంది.

అక్టోబర్ 18వ తేదీన టీజర్ ను విడుదల చేయబోతున్నామని స్పష్టం చేస్తూ విడుదలైన ఈ ప్రోమో వీక్షకులను ఆకట్టుకుంటోంది. అతి తక్కువ సమయంలోనే తన పాటలను గానీ, బ్యాక్ గ్రౌండ్ ను గానీ అందిస్తారన్న టాక్ థమన్ కున్న అతి పెద్ద ప్లస్ పాయింట్. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా అయినా, తనకు ఓ సూపర్ హిట్ లభిస్తుందని విక్రం వేచిచూస్తున్నాడు.

ADVERTISEMENT
Latest Stories