జగన్ దర్శకుల పతనం – హిట్ల నుంచి బూతుల దాకా

RGV Mahi v Raghavమోహన్ బాబు లాంటి దిగ్గజ నటులతో మొదలుపెట్టి జోగి నాయుడు లాంటి చిన్న ఆర్టిస్టు దాకా, ఒకప్పుడు కల్ట్ డైరెక్టరని పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ నుంచి మూడు సినిమాల అనుభవమున్న మహి వి రాఘవ దాకా అందరూ జగన్ మోహన్ రెడ్డి ట్రాప్ లో పడిపోయారు. కొందరు కాస్త స్పృహ వచ్చి బయపడగా మరికొందరు వైసిపి జీతభత్యాల ఉచ్చులో పడి ఉనికిని పోగుట్టుకుంటున్నారు.

వీళ్ళలో ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దాదాపు ఒక డైలీ లేబర్ గా మారిపోయి తన స్థాయికి ఏ మాత్రం సరితూగని బానిసత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ కోసం కట్టబెడుతున్నారు. యాత్ర సినిమాతో మొదలుపెట్టిన ప్రాపగండాని ఇప్పుడు జగన్ మెప్పులు పొందేందుకు యాత్ర 2గా తీసే పనిలో పడ్డ మహి వి రాఘవ్ సరిగ్గా ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు.

ADVERTISEMENT

ఒకప్పుడు శివ, రంగీలా, సత్య, క్షణ క్షణం లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ తో ఇండియన్ సినిమాలో గుర్తింపు పొందిన వర్మ ఇప్పుడు నేకెడ్, బ్యూటిఫుల్, డేంజరస్ అంటూ దిగజారిన బూతు కంటెంట్ తో నీలి దర్శకులు సైతం సిగ్గు పడేలా సెక్స్, బూతులను జొప్పిస్తున్నారు. తనలో సగం వయసు లేని అమ్మాయిల కాళ్ళను నాకుతూ అదేదో ఘనకార్యంలా ఫీలైనప్పుడే పతనం పీక్స్ కు చేరుకుంది.

జగన్ క్యాంపులో ఉన్న మహి రాఘవ్ ఆర్జివి బాటలోనే నడుస్తున్నాడు. సైతాన్ పేరుతో తీసిన బి గ్రేడ్ వెబ్ సిరీస్ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత జుగుప్సాకరమైన కంటెంట్ గా తీవ్ర విమర్శల పాలవుతోంది. కారుడు గట్టిన నేరస్థులు సైతం నివ్వెరపోయేంత బూతులు, హింస జొప్పించారు.

పైగా కేవలం ఒక వర్గం ఆడియన్స్ కోసమే తీశానని సహజత్వం కోసం ఆ మాత్రం నగ్నత్వం బూతు అవసరమేనంటూ తనను తాను మహి వి రాఘవ్ సమర్ధించుకున్న తీరు ఉన్న కాసింత గౌరవాన్ని తగ్గించేసింది. తర్వాత ఏ సినిమా చేయాలో తెలియని సందిగ్ధంలో, యాత్ర 2 ఎప్పుడు మొదలుపెట్టాలో తెలియని అయోమయంలో ఉన్న ఈ దర్శకుడు డబ్బుని సులువుగా సంపాదించడం కోసమే సైతాన్ దారి పట్టినట్టు కనిపిస్తోంది.

ఇదంతా చూస్తుంటే ఆర్జివి, మహి వి రాఘవ్ డీలాంటి దర్శకులు జగన్ స్కూల్ డైరెక్టర్లుగా ఆఖరికి పార్న్ బాపతు అశ్లీల సినిమాలు తీసుకునే ముద్ర వేయించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది . జగన్ ని ప్రసన్నం చేసుకుని సొమ్ములు దండుకునే ఉద్దేశం ఏదైనా ఉందేమో కానీ చేస్తున్న పనులు తీస్తున్న చిత్రాలు మాత్రం ఎప్పటికీ మాయని మచ్చలు పెడుతున్న మాట వాస్తవం.

ADVERTISEMENT
Latest Stories