తెలంగాణలో అంతా బావుందని, కేసులు తగ్గుతున్నాయని… నాలుగు వారాలలో పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. పైగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయని, ప్రైవేటు ఆసుపత్రులలో ఇన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయని ఊదరగొడుతూ ప్రకటనలు కూడా విడుదల చేస్తుంది.
అయితే సోషల్ మీడియా బెడ్లు కోసం, మందుల కోసం, ఆక్సిజన్ సీలిండర్ల కోసం ఆర్తనాదాలు చేసే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపు… ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు పెట్టారు. తెలంగాణలోకి వెళ్తున్న కోవిడ్ పేషేంట్ల అంబులెన్సులు సరిహద్దులే వద్దే ఆపేస్తున్నారు.
తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇస్తుమని చెబుతున్నా బాధితులు మాత్రం బెడ్ ఉన్నా తమను అనుమతించడం లేదని అంటున్నారు. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో బెడ్ల కొరత ను పరిష్కరించడానికే ఈ చర్య తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
తెలంగాణ చెక్ పోస్టుల వద్ద ఆంధ్ర అంబులెన్సుల క్యూ కట్టడం గమనార్హం. ప్రభుత్వాలు ఏమని చెప్పినా రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి తీవ్రతకు ఇది అర్ధం పడుతుంది. ప్రభుత్వాలు తమ గొప్ప కోసం చెప్పుకుని గొప్పలు నమ్మకుండా ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.





