
పార్టీ స్థాపించి 14 ఏళ్ళు పూర్తి చేసుకుని ఒక సారి 67 సీట్లతో ప్రతిపక్ష పాత్ర మరోసారి 151 సీట్లతో అధికార పక్షంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన ముద్ర వేసింది వైసీపీ. తండ్రి రాజకీయ వారసత్వంతో రాజకీయాలలోకి వచ్చిన జగన్ తన పాలను ఏపీ ప్రజలకు రుచి చూపించారు.
అలాగే వెండి తెర మీద మెగా స్టార్ గా వెలిగిన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఇచ్చిన అవమానాలను, అవహేళనలను రాజకీయ వారసత్వంగా జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. పార్టీ స్థాపించి దశబ్దం పూర్తి చేసుకున్న జనసేన ఓ ఎన్నికలలో పవన్ తో సహా ఓడి ఘోర ఓటమిని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంది.
Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
అయితే పడ్దవాడు ఎప్పటికి చెడ్డవాడు కాలేడని, తగ్గితే నెగ్గుతామని నిరూపిస్తూ 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 కి 21 నెగ్గి భారత దేశ రాజకీయాలలోనే ఎవరికీ సాధ్యం కానీ ఘనతను సృంచింది జనసేన. అయితే ఈ రెండు పార్టీల పుట్టుక దాదాపు ఒకటే జనరేషన్ లో జరిగినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కొన్ని తరాల భవిష్యత్ ను ప్రభావితం చేస్తున్నాయి.
ఒక్కఛాన్సు అంటూ వచ్చి జగన్ కూల్చి వేతలను, శవ రాజకీయాలను, హింసా ప్రవృత్తిని, రాజకీయ వేధింపులను రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేసారు. ఒక్క అవకాశం కావాలి అంటూ తనకున్న బలాన్ని, బాధ్యతను రాష్ట్ర అభివృద్ధికి కేటాయిస్తూ ఎన్ని అవమానాలు ఎదురైన పంటి బిగువున పెట్టుకుని ఓర్పును, త్యాగాన్ని అనుసరించి కొత్త రాజకీయ విధానాలకు శ్రీకారం చుట్టారు పవన్.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
అధికారం తాలూకా బలుపుకు, బరితెగింపును వైసీపీ చూపిస్తే విజయం తాలూకా బాధ్యతను, జవాబుదారీ తనాన్ని జనసేన చూపిస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వరదలొచ్చి పంట నష్టపోయిన రైతులను కలవడానికి కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు రోడ్ మీద సెట్ వేయాల్సి వచ్చింది. ఇక వైసీపీ నాయకులు, మంత్రులైతే కనీసం తమ నియోజకవర్గాలలో పర్యటనలు కూడా చెయ్యలేదు.
కానీ ఇప్పుడు జనసేన గెలిచిన అన్ని ప్రాంతాలలో ఎమ్మెల్యే లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యల మీద ఆరా తీస్తూ వాటి పరిష్కారానికి సూచనలు చేస్తున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండి నీటిని కిందకు వదులుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు జనసేన ఎమ్మెల్యే లు.
Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు
గత ప్రభుత్వంలో అధికారం చేతిలో ఉంటే ఎవరినైనా బూతులు తిడతాం, వారి కుటుబంలోను మహిళల పైన రాజకీయ విమర్శలు చేస్తాం, వ్యక్తిగత జీవితాన్నిబజారున పడేస్తాం, దాడులు చేస్తాం , హత్యలకు వెనకాడం, కూల్చివేతలను ప్రోత్సహిస్తాం, కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, పరిశ్రమలను తరిమేస్తాం, గులక రాయి, కోడికత్తి రాజకీయాలకు తెరలేపుతాం అంటూ బరితెగింపుతో ముందొచ్చిన వైసీపీ రాష్ట్ర భవిష్యత్ ను మరోపదేళ్లు వెనక్కి నెట్టింది.
రాజకీయాలలో అధికారమే పరమావధి కాకూడదు, రాజకీయ ప్రత్యర్థి వేరు శత్రువు వేరు వైసీపీ మనకి ఎప్పటికి రాజకీయ ప్రత్యర్ధే శత్రువు కాదు కాకూడదు, వైసీపీ నేతల మీద రాజకీయ దాడులు, కక్ష్య సాధింపు చర్యలను ఎవ్వరు ప్రోత్సహించవద్దని, ఆ విష సంస్కృతికి ఇక్కడితో చరమ గీతం పాడేయాలంటూ పవన్ జనసేన నేతలకు, క్యాడర్ కు గెలుపు తాలూకా బాధ్యతను గుర్తుచేసి రాష్ట్ర భవిష్యత్ పురోగమనానికి అడుగులు వేశారు.
పదవి అంటే అలంకారం కాదు ప్రజలకు సేవ చేసే అవకాశం మత్రమే అని, అధికారం అంటే అందలం ఎక్కడం కాదు సేవకుడిగా పని చేయడమని జనసేన నిరూపిస్తుంది. దీనితో వైసీపీ బరితెగింపుకు జనసేన బాధ్యతకు ఉన్న పాలన పారమైన అనుభవాన్ని ఏపీ ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. అవకాశం కోసం అరువులు చాచడం కాదు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం ఎలా అనేది జనసేనను చూసి వైసీపీ తెలుసుకోవాలి.