తిమ్మరాజుపల్లి టీవీ: చివరికి మిగిలిందేమిటి?

Kiran Abbavaram promoting Thimmarajupalli movie with cast and team

హీరోగా తానే ఇప్పుడిప్పుడు నిలదొక్కుకుంటున్న తరుణంలో.. కిరణ్ అబ్బవరం కొత్తవాళ్లని ఎంకరేజ్ చేయడం కోసం దాదాపుగా 40 మంది నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేస్తూ, తన టీమ్ మెంబర్స్ అయిన మునిరాజుని దర్శకుడిగా, సాయితేజ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసి మరీ ప్రొడ్యూస్ చేసిన “తిమ్మరాజుపల్లి” గత శుక్రవారం విడుదలై డీసెంట్ టాక్ సంపాదించుకుంది.

ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అన్నారే కానీ, ఎవరూ సినిమాని తక్కువ చేసి మాట్లాడలేదు. రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. అయితే.. జనాల్లోకి సినిమాని తీసుకెళ్లడంలో మాత్రం చిత్రబృందం విఫలమైంది.

ADVERTISEMENT

ఫలానా సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని కచ్చితంగా థియేటర్లలో చూడాలి అనే క్యూరియాసిటీని బిల్డ్ చేయలేకపోయింది. అందువల్ల సినిమా బాగానే ఉంది అని టాక్ వచ్చినా. జనాలు థియేటర్లకి రాలేదు.

దాంతో ఓవర్సీస్ లో 8 వేల డాలర్ల దగ్గర ఆగిపోయిన కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా అంతే. కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాలేదు. తక్కువ రేట్ కే అమ్మినప్పటికీ, రెస్పక్టబుల్ కలెక్షన్స్ రావు అని అర్థమైపోయింది.

నిర్మాతగా కిరణ్ ఆల్రెడీ ఆహా ఓటీటీకి మంచి నెంబర్ కి అమ్మేసి కాస్త సేఫ్ అయ్యాడు. డిజిటల్ రైట్స్ రూపంలో ఇంకొత్త రావొచ్చు. అయితే.. పూర్తిస్థాయిలో సేఫ్ అవ్వడం అనేది కాస్త కష్టమే. పాపం కిరణ్ మంచి ఉద్దేశ్యంతో నిర్మించినా.. టీమ్ మెంబర్స్ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. సక్సెస్ మీట్ పెడితే, అక్కడ సినిమా గురించి మాట్లాడకుండా, కిరణ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసారు. చివరికి “తిమ్మరాజుపల్లి” చిత్రంతో నిర్మాతగా గుడ్ విల్ ను తప్ప ఏమీ మిగుల్చుకోలేకపోయాడు కిరణ్ అబ్బవరం.

ADVERTISEMENT
Latest Stories