సింగిల్ ట్రాక్ – బ్లాక్ బస్టర్ ఆడియోకు సిగ్నల్!

Tholi-Prema-Ninnila-Songసంగీత దర్శకుడిగా ఎస్.ఎస్.థమన్ టైం పీక్స్ లో నడుస్తోందని చెప్పవచ్చు. ‘పట్టిందల్లా బంగారం’ అంటే ప్రస్తుతం దానికి థమన్ పేరే చెప్పాలేమో! బ్యాక్ గ్రౌండ్, ఆడియో సాంగ్స్ లలో తనదైన మ్యాజిక్ కు సృష్టించుకుంటున్న థమన్ సంగీతం నుండి “తొలిప్రేమ” సినిమా ఫస్ట్ సింగిల్ ట్రాక్ బయటకు వచ్చింది. మరి పాట ఎలా ఉంది? అన్న సందేహం వలదు. ఎందుకంటే… ఈ ఫస్ట్ సింగిల్ ట్రాక్ చార్ట్ బస్టర్స్ లో ఖచ్చితంగా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

థమన్ అందించిన బాణీకి శ్రీమణి అందించిన సాహిత్యం వీనులవిందుగా ఉంది. ముఖ్యంగా ఈ పాట మధ్యలో వచ్చే “ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా… నీ ఎదలోని పేరే పలికే ఇవాళే ఇలా…” వినేకొద్ది వినాలనిపించే విధంగా ఉంది. ఇక ప్రేమికులకైతే ఇలాంటి పాటలు మొదటిసారి వినగానే ఎక్కేస్తాయి. ఆర్మాన్ మాలిక్, థమన్ లు ఆలపించిన ఈ పాట ముగింపులో… ‘తొలిప్రేమ’ టైటిల్ సాంగ్ శాంపిల్ ను కూడా వినిపించారు. ఈ రెండు పాటలతో “తొలిప్రేమ” ఆడియో బ్లాక్ బస్టర్ అన్న విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories