లేటెస్ట్ అప్ డేట్ – 122 కోట్లు కొల్లగొట్టింది!

Tiger Zinda Hai Overseas Boxoffice Collectionsగతేడాది ఎండింగ్ లో బాలీవుడ్ కు ఫైనల్ కిక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ “టైగర్ జిందా హై” సినిమా, ఇండియన్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ లోనూ దుమ్ము దులిపింది. సల్మాన్ ‘ట్యూబ్ లైట్’ భారీ డిజాస్టర్ గా నిలవడంతో, నిరాశ చెందిన కండల వీరుడు అభిమానులకు, ‘టైగర్ జిందా హై’ కావల్సినంత వినోదాన్ని అందించింది. మూడు వారాలు ముగిసే సమయానికి ఓవర్సీస్ రిపోర్ట్ ను పరిశీలిస్తే… మొత్తమ్మీద 19.21 మిలియన్స్ (ఇండియన్ కరెన్సీలో 122.12 కోట్లు) కొల్లగొట్టింది.

ADVERTISEMENT

అమెరికా – కెనడా మార్కెట్ లో 5.6 మిలియన్స్, యుఏఈలో 6.6 మిలియన్స్, యుకేలో 2.2 మిలియన్స్, రెస్టాఫ్ వరల్డ్ 4.6 మిలియన్ డాలర్స్ తో కలిపితే… దాదాపుగా 20 మిలియన్ డాలర్స్ కు చేరువ అయ్యింది. ఇక ఇండియన్ మార్కెట్ లో అయితే 318.86 కోట్లు కొల్లగొట్టి ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లకు చేరువలో ఉంది. ఇండియన్ మార్కెట్ లో తొలి వారంలోనే 206 కోట్లు కొల్లగొట్టగా, రెండవ వారంలో 85.51 కోట్లు, మూడవ వారంలో 27.31 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని పంచింది.

ADVERTISEMENT
Latest Stories