సినీ హీరో నారా రోహిత్ కోసమంటూ భారీ మోసం!

TNSF Leader Cheated financiers for nara rohith movieనవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా వెలుగొందుతున్న విజయవాడలో మరో మోసం వెలుగు చూసింది. వరుస సంచలన విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న విజయవాడ, ఈ సారి సినీ హీరో నారా రోహిత్ పేరును వెలుగులోకి తీసుకువచ్చింది.

టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) కు చెందిన నేత సాయికృష్ణ ఈ “ఘనకార్యాన్ని” నిర్వహించారు. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు కుమారుడు అయిన సినీ హీరో నారా రోహిత్ సినిమాలకు డబ్బులు కావాలంటూ సాయికృష్ణ కోట్లాది రూపాయలను అప్పుగా పలువురి వద్ద నుండి సేకరించాడు.

ADVERTISEMENT

అయితే గడువు ముగిసినా, సాయికృష్ణ రుణం చెల్లించకపోవడంతో రుణాలు ఇచ్చిన వారు సాయికృష్ణను నిలదీయగా, డబ్బు కోసం వేధిస్తే కాల్ మనీ కింద కేసు పెడతానంటూ సాయికృష్ణ రుణ దాతలను బెదిరించిన వైనం తాజాగా వెలుగు చూసింది. దీంతో భయబ్రాంతులైన రుణ దాతలు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాయికృష్ణ వ్యవహారంపై విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై నారా రోహిత్ స్పందించారు. “తన పేరు చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసిన టీఎన్ఎస్ఎఫ్ నేత సాయికృష్ణతో తనకెలాంటి సంబంధం లేదని, కేవలం అతను ఒక అభిమానిగానే తెలుసని” నారా రోహిత్ స్పష్టం చేశారు.

ADVERTISEMENT
Latest Stories