కేసీఆర్‌ సెంటిమెంట్ రాజకీయాలకు చెక్ పెట్టాలంటే…

Telangana-BRS-KCR

నేడు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాభవన్‌లో ముఖాముఖి సమావేశం కానున్నారు.

పదేళ్ళుగా అపరిష్కృతంగా ఉండిపోయిన విభజన సమస్యల గురించి వారు చర్చించనున్నారు. వాటిలో 75 శాతం చాలా సంక్లిష్టమైనవే. చిక్కు ముడులు పడిన వాటన్నిటినీ ఒకే ఒక్క సమావేశంలో పరిష్కరించేస్తారని ఎవరూ ఆశించడం లేదు. కానీ వాటిని పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయగలరనే అందరూ భావిస్తున్నారు.

ADVERTISEMENT

కేసీఆర్‌ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్యలను పరిష్కరించకుండా వాటితో తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూ బిఆర్ఎస్ పార్టీ కోసం వాడుకున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కనుక ఇంకా వాడుకోవాలనే అనుకుంటున్నారు.

శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ చేరుకున్నప్పుడు ఆయనకు స్వాగతం చెపుతూ టిడిపి నేతలు ఫ్లెక్సీ బ్యానర్లు కడితే, “తెలంగాణపై మళ్ళీ ఆంధ్రా పెత్తనం మొదలైందంటూ” బిఆర్ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టడమే ఇందుకు నిదర్శనం.

అంటే విభజన సమస్యలు ఎప్పటికీ అపరిష్కృతంగా ఉండిపోవాలని బిఆర్ఎస్ కోరుకుంటున్నట్లు భావించవచ్చు. కనుక చంద్రబాబు, రేవంత్‌ ముందుగా వీటి నుండి రాజకీయాలను వేరు చేయాల్సి ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఉన్నతాధికారులు, నిపుణులు, మేధావులతో కమిటీలు ఏర్పాటు చేసి ఈ సమస్యలను పరిష్కరించుకోవలసి ఉంటుంది.

అక్కడ బిఆర్ఎస్, ఇక్కడ వైసీపిలు వీటిపై సెంటిమెంట్ రాజకీయాలు చేయడం కూడా ఖాయం. కనుక వాటిని ధీటుగా ఎదుర్కోవలసి ఉంటుంది. లేకుంటే ఈ సమస్యలపై చర్చలు మద్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే తెలంగాణ రాజకీయ పరిణామాలలో మార్పులు మొదలైనా ఈ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

అంటే కేవలం విభజన సమస్యలను పరిష్కరించాలనుకుంటే సరిపోదని వాటితో ముడిపడున్న ఈ రాజకీయాలను కూడా చేధించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది. మరోవిదంగా చెప్పాలంటే ఏవో కారణాలతో విడిపోయిన భార్యాభర్తలు చట్టబద్దంగా విడాకులు తీసుకోకుండా కీచులాడుకుంటూ సమస్యలతో గడుపుతున్నట్లు అనుకోవచ్చు.

కానీ ఈ విభజన సమస్యలను పరిష్కరించగలిగితే రెండు రాష్ట్రాలకు ఎలాగూ మేలు కలగుతుంది. వాటితో పాటు ఇకపై బిఆర్ఎస్, వైసీపిలు వాటితో రాజకీయాలు చేసే అవకాశం లేకుండా కూడా చేయవచ్చు. కనుక ఇరు ప్రభుత్వాలు చాలా పట్టుదలతో, చిత్తశుద్ధితో వీలైనంత వేగంగా ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories