దేశవ్యాప్తంగా సినిమా ను ఆదరించే రాష్త్రాలెన్నో ఉన్నప్పటికీ, మన తెలుగు రాష్ట్రాలకు సినిమా అనేది ఒక విడతియ్యలేని తోడు. టాలీవుడ్ ప్రేక్షకుడికి బాదొచ్చినా సినిమా, సంతోషమొచ్చినా ఎంచుకునే ఒక ఎమోషన్ సినిమా.
అలాగే పండగొచ్చినా సినిమా, సెలవొచ్చినా, ఫ్యామిలీ తో అయినా సింగల్ గా అయినా సరదాగా ఎంజాయ్ చేసే ఆప్షన్ సినిమా. ఇక సినిమా హీరోల మీద ఇక్కడి అభిమానులు చూపించే ప్రేమ, వారి పట్ల ప్రేక్షుడికి ఉండే ఆరాధన మరేఇతర భాష అభిమానులలో కనిపించదు అనేది ముమ్మాటికీ ఒప్పుకోవాల్సిన వాస్తవం.
హీరో లకు ఎక్కడా అందని ఆదరణ మన తెలుగు రాష్ట్రాల్లో అందుతుంది. అలాంటిది తమ ఫెవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు దానిని ఒక పండగ రీతిలో సంబరాలు చేసుకుంటారు. మరి అలా వచ్చిన సినిమా బాగుండి హిట్ అయితే వారిని ఆపలేము. అదే సినిమా బాగోకపోతే..?
ఈ ప్రశ్నకు 2025 దగ్గర చాలానే సమాధానాలున్నాయి. సంవత్సరం మొత్తం మీద యునానిమస్ టాక్ వచ్చి హిట్ అయిన సినిమాలు ఎన్ని అంటే వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే సంఖ్య ఉంటుందనేది అతిశయోక్తి కాదు. తన ఫాలోయింగ్ వల్ల గాని, ముందు సినిమా వల్ల గాని, డైరెక్టర్ వల్ల గాని, ఇలా రీజన్ ఏదైనా సినిమా పై అంచనాలు పెరిగిపోతాయి.
అలా పెరిగిన అంచనాలు అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయితే, నిర్మొహమాటంగా సినిమా ప్లాప్ అనే తీర్పు వచ్చేస్తుంది. అలాగే ఈ ఏడు మొదటిలోనే సంక్రాంతి కానుకగా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిసాస్టర్ ను చవి చూడగా, దిల్ రాజు ప్రొడ్యూసర్ గా అడ్డంగా దొరికేసాడనుకున్నప్పటికీ, అదే పండగలో మరో సినిమా వల్ల బతికిపోయాడు.
సినిమా రిలీజ్ అవ్వకముందు నుండే అనుమానాలు ఉన్నపటికీ, రిలీజ్ అయినా తరువాత మెగా ఫ్యాన్సే ఈ సినిమా ను వద్దనుకున్నారు. RRR తరువాత చెర్రీకి వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ఈ సినిమాతో ఒక్కసారిగా నీరుకారిపోయిందనే చెప్పాలి.
అలాగే ‘హరి హర వీరమల్లు’ తో ఎన్నాళ్ళుగానో ఊరిస్తూ ఎట్టకేలకు ఈ సంవత్సరం ప్రజల ముందుకు వచ్చిన ఈ సినిమా కు కూడా ప్రజలు అస్సలు ఆలస్యం చేయకుండానే డిసాస్టర్ టాక్ ఇచ్చేసారు. పూర్ స్క్రిప్ట్, స్టైలింగ్, డబ్బింగ్, విషువల్స్, వీ.ఎఫ్.ఎక్స్, ఇలా కుదిరిన అన్ని కోణాలలోను ఫెయిల్ అయిన వీరమల్లు, బాక్స్-ఆఫిస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. పవన్ స్టార్ డం, ప్రమోషన్స్ కూడా ఈ సినిమాను గట్టించలేకపోయింది.
‘జెర్సీ’ తో తెలుగు సినీ అభిమానుల మనసు దోచుకున్న దర్శకుడు గౌతమ్ వరుస ప్లాప్స్ తో ఉన్న విజయ్ దేవరకొండ తో కలిసి ‘కింగ్డమ్’ అంటూ భారీ అంచనాల మధ్య థియేటర్ల ముందకు వచ్చారు. అయితే, కొత్తదనం లేని రొటీన్ స్టోరీ, ఆల్రెడీ ఎక్కడో చూసాము అనే ఫీలింగ్ ఈ సినిమా ను బాక్స్-ఆఫిస్ వద్ద బలంగా నిలబెట్టలేకపోయింది.
ఇక చివరిగా ‘వార్-2’ అంటూ జూనియర్ ఎన్.టీ.ఆర్ బాలీవుడ్ పర్యవేక్షణలో స్పై యూనివర్స్ లో పాత్ర పోషిస్తూ, తాను చేసిన గత 5-6 చిత్రాల కంటెంట్ మీద నమ్మకంతో అభిమానులు థియేటర్లకు వెళ్లగా, ఈ సినిమా వారిని మెప్పించటంలో పూర్తిగా విఫలమయింది.
RRR తరువాత వచ్చిన దేవర సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ నుంచి తప్పించుకుని విజయాన్ని అందుకున్న తారక్ ఆ విజయాల పరంపరను వార్ – 2 తో కొనసాగిస్తారు అనుకున్న ఫాన్స్ ఆశలను తారక్ పూర్తిగా నిరాశపరిచారనే చెప్పాలి.
అయితే, స్టార్ హీరోల సంగతే కాదు చిన్న హీరోలైన టిల్లు మరియు టిల్లు స్క్వేర్ తో అభిమానులను అలరించిన సిద్ధూ ఈ సంవత్సరం ‘జాక్’ అంటూ వచ్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇంత అవుట్-డేటెడ్ స్క్రిప్ట్ మరియు పూర్ కంటెంట్ తో ఎలా ముందుకు వచ్చారంటూ ప్రశ్నలను ఎదుర్కోక తప్పలేదు.
ఇక ‘లైలా’ అంటూ లేడి గెటప్ తో వచ్చిన విశ్వక్ ది కూడా అదే పరిస్థితి. ఇలా ఈ ఏడు భారీ అంచనాల మధ్య విడుదలయ్యి తుస్సుమన్న సినిమాలు ఇంకా ఉన్నాయి. కానీ అటు హీరోలకి, వారి అభిమానులకు కలగా ఉండాల్సిన ఈ సినిమాలు మాత్రం వారి కెరియర్ లో ఇలా కళాఖండాలుగా మిగిలిపోయాయి.






