సినీ ప్రపంచానికి టాలీవుడ్ ప్రేక్షకుడే రారాజా..?

Tollywood Audience Redefines Cinema Beyond Language

సగటు టాలీవుడ్ ప్రేక్షకుడిని మెప్పించడానికి భారీ బడ్జెట్ సినిమాలే తియ్యనక్కరలేదు, అలాగే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలనే ఎన్నుకోవాల్సిన అవసరం లేదు, ఇక అది కేవలం తెలుగు సినిమానే కావాలని అనే ప్రాంతీయ భాషా బేధాలు ఉండక్కరలేదు అనే స్పష్టత యావత్ సినీ ప్రపంచానికి ఇచ్చారు తెలుగు సినీ అభిమాని.

సినిమా కంటెంట్ నచ్చితే అది తెలుగు సినిమానా.? స్టార్ హీరో ఉన్నారా.? భారీ బడ్జెట్ మూవీ నా.? సీనియర్ దర్శకుడా.? మల్టీ స్టారర్ చిత్రమా.? ఇలా ఏ అంశాన్ని పట్టించుకోకుండా మూవీ ని హిట్ చేసే టాలీవుడ్ ప్రేక్షకుడు అదే సినిమా కంటెంట్ వారిని మెప్పించలేకపోతే కూడా ఈ అంశాలన్నిటినీ పక్కన పెట్టేసి మూవీ ఫలితాన్ని డిజాస్టర్ గా మార్చగలరు.

ADVERTISEMENT

ఇందుకు తాజాగా విడుదలైన తెలుగు అనువాద చిత్రం రిషబ్ శెట్టి కాంతారా ఒక సందర్భానికి ఉదాహరణగా నిలిస్తే, ఎన్టీఆర్ – హృతిక్ మల్టీ స్టార్ మూవీ వార్ – 2 మరో అంశానికి సాక్ష్యంగా నిలిచింది. అలాగే టాలీవుడ్ సినీ ప్రేక్షుకుడి వినోదానికి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అనే భాషాభేదం కూడా ఉండదు.

ఇందుకు ఉదాహరణగా తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, బడా హీరోలు విజయ్, అజిత్, సూర్య, కార్తీ, విక్రమ్, ధనుష్ వంటి అనేకమంది తమిళ హీరోలకు తెలుగులో కూడా ఓ స్థాయిలో మార్కెట్ ఏర్పడింది. అలాగే కేజిఫ్ తో కన్నడ హీరో యష్ టాలీవుడ్ రాఖీ బాయ్ అయిపోయారు.

ఇక కాంతారా తో రిషబ్ శెట్టి తెలుగు ప్రేక్షకుడి మెప్పుపొందారు. అలాగే మలయాళం సూపర్ స్టార్స్ మెహన్ లాల్, మమ్ముటి లకు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక మమ్ముటి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీతో టాలీవుడ్ లక్కీ భాస్కర్ అయ్యారు.

అలాగే ఏ ఇతర రాష్ట్రాలలోను లేని విధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచినా టాలీవుడ్ ప్రేక్షకుడు మాత్రం అది తెలుగు సినిమానా లేక ఇతర భాష అనువాద చిత్రమా అనే తేడా లేకుండా అటు ప్రభుత్వ నిర్ణయానికి తలొగ్గి సినీ చిత్ర పరిశ్రమకు వెన్నుదండుగా నిలుస్తాడు.

ఇక నేపోకిడ్స్ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ల వరకు సినీ పరిశ్రమకు ఎవరు వచ్చి తమకు చక్కటి వినోదాన్ని అందించినా వారిని నెత్తిన పెట్టుకోవడం కూడా టాలీవుడ్ ప్రేక్షకుడికే చెల్లింది. మరి ఇంతటి ఉదార హృదయం ఉన్న టాలీవుడ్ ప్రేక్షకుడి కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ చేస్తుంది.? ఏం చెయ్యాలి.?

ADVERTISEMENT
Latest Stories