ఫస్ట్ ఛాన్స్ తో ‘గోల్డెన్ లెగ్’ ఆ తరువాత..?

Raashii Khanna Krithi Shetty Anupama Payal

సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలగడానికి ఎంతోమంది ఫాషన్ గా ఈ గ్లామర్ ఫీల్డ్ కు వస్తుంటారు. అయితే వచ్చిన ప్రతివారు సినీ రంగంలో తమను తాము నిరూపించుకుని నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు అని అందం, అభినయం రెండు ఉన్న నటీమణులు రుజువు చేస్తున్నారు.

ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సినిమాతోనే హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన నటీమణులకు సైతం ఆ తరువాత రాణించడం కష్ట సాధ్యమవుతుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశి ఖన్నా విషయానికి వస్తే వచ్చిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని యువత మనసు దోచుకుంది.

ADVERTISEMENT

అటు నటనతో ఇటు తన గ్లామర్ తో ఇటు సినీ ప్రేక్షకులను, అటు సినీ దర్శకులను తన వైపు ఆకర్షించింది రాశి. అయితే రాశి ఖన్నా సినీ కెరీర్ మొత్తం మీద ఆమె హిట్ పర్శంటేజ్ చాల తక్కువనే చెప్పాలి. తొలిప్రేమ, ప్రతిరోజూ పండుగే, జై లవ కుశ వంటి సినిమాలు మినహాయిస్తే రాశి ఖాతాలో పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు తక్కువే.

వచ్చిన విజయాలను కూడా స్టార్లు పట్టించుకోకపోవడంతో ఈ అమ్మడికి స్టార్స్ పక్కన నడిచే అవకాశం దక్కలేదు. ఒక్క జూ. ఎన్టీఆర్ మినహియిస్తే మరే స్టార్ హీరో పక్కన కూడా జత కట్టలేకపోయింది ఈ ఢిల్లీ సుందరి. అయితే సినిమాలలో అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు కాస్త గ్లామర్ డోస్ పెంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది రాశి.

అలాగే RX 100 తో నెగటివ్ రోల్ తో పరిచయమై పాజిటివ్ ఇమేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ మెరుపు తీగ లాగ్ ఇలా వచ్చి అలా కనుమరుగయ్యింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యిందో, పరిమితం చేసారో కానీ ఈ అమ్మడిని ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించలేదు. హలో తో టాలీవుడ్ కి హాయ్ చెప్పిన కళ్యాణి ప్రియా దర్శి చిత్రలహరితో బాయ్ చెప్పేసింది.

హలో తో ఆకట్టుకుని, చిత్రలహరితో హిట్ ఇచ్చినప్పటికీ కళ్యాణికి కాలం కలిసి రాలేదు. ఇక ఉప్పెనతో ఉవ్వెత్తున ఎగిసిన కృతి శెట్టి వచ్చిన మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్క్ ను టచ్ చేసారు. ఇటు నటనతో అటు గ్లామర్ పాత్రలతో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. ఆరంభ సౌరత్వం మాత్రమే ప్రదర్శించి ఇప్పుడు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు కృతి.

ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఫేమస్ అయిన షాలిని పాండ్యా మొదటి విజయం ఇచ్చిన కిక్ తో తడబడ్డారు, నిలబడలేకపోయారు. శతమానం భవతి సినిమాతో మెయిన్ హీరోహిన్ గా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ మొదటి సినిమాతోనే పక్కంటి అమ్మాయిల తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలిచింది.

కూల్ లుక్ తో, సెటిల్ యాక్టింగ్ తో విజయాలు, అపజయాల ఒడిదుడుకులతో కెరీర్ ను నెట్టుకొస్తున్నారు అనుపమ. అయితే హిట్లు ఉన్నప్పటికీ ఈ అమ్మడికి పెద్ద సినిమాలలో అవకాశాలు దక్కలేదు. దానితో అప్పటి వరకు చీరలో, లంగా ఓణిలో ముద్దుగా ఉన్న ఈ అమ్మడు కాస్త ఒక్కసారిగా హద్దులు చెరిపి గ్లామర్ పాత్రలకు సై అంది. వీరందరూ మొదటి సినిమాతోనే గోల్డెన్ లెగ్ తో అడుగుపెట్టినప్పటికీ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories