వైసీపీ ఓటమితో ఒక్కో వైసీపీ సీనియర్ నాయకుడు ఒక్కో కారణంగా జగన్ కు దూరంగా వెళ్తున్నారు. మొన్నటి వరకు పార్టీలో నెంబర్ గా చెలామణి అయిన విజయసాయి రెడ్డి సైతం వైసీపీ ఓటమితో రాజకీయాలకు వాలంటరీ రిటర్మెంట్ ప్రకటించి జగన్ ను విడిచివెళ్లిపోయారు.
ఇక గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, సకల శాఖ మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డి నేడు బయటకొస్తున్న వైసీపీ సకల అవినీతి కేసులలోను ఆరోపణలు ఎదుర్కొంటు వైసీపీ రాజకీయానికి దూరంగా, మౌనంగా ఉంటున్నారు.
ఇక నాడు వైసీపీ హయాంలో పుంగనూరు మహా నేతగా చెలామణి అయిన మరో వైసీపీ కీలక నాయకుడు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి కూడా గత కొన్ని రోజులుగా వైసీపీ లో మౌనం పాటిస్తూ ఉంటున్నారు.
అయితే లిక్కర్ స్కాం కేసులో పెద్ది రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి అరెస్టయిన నేపథ్యంలో కూడా పెద్ది రెడ్డి కుటుంబానికి జగన్ దగ్గర నుంచి రావాల్సిన మద్దతు కానీ, వైసీపీ నుంచి అందవలసిన సహకారం కానీ అందలేదని వైసీపీ లోనే గుసగుసలు వినిపించాయి.
జగన్ సైతం లిక్కర్ కేసు నుండి బైలు మీద బయటకొచ్చిన మిథున్ రెడ్డి తో భేటీ కాకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. ఇక కడప వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దా రెడ్డి సైతం రాజకీయంగా వైసీపీ కి దూరంగానే ఉంటూ వస్తున్నారు.
ఇక వైసీపీ లో మరో సీనియర్ నాయకుడు సుబ్బా రెడ్డి కూడా జగన్ పర్యటననలో యాక్టీవ్ గా పాల్గొనడం లేదు. వైసీపీ కీలక సమావేశాలలో కనిపించడం లేదు. అలాగే వైసీపీ పార్టీ క్యాడర్ కు సైతం సుబ్బా రెడ్డి అందుబాటులో ఉండడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉంటూ జగన్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన ఈ ఐదుగురు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్ది రెడ్డి రామచందర్ రెడ్డి, కేతి రెడ్డి పెద్దారెడ్డి, సుబ్బారెడ్డి వైసీపీ కి పంచభూతాలుగా పని చేసారు.
కానీ ఇప్పుడు ఆ పంచభూతాలలో ఒకరైన సాయి రెడ్డి వైసీపీ కి రాజీనామా చేసి జగన్ ను విడిచి వెళ్లిపోయారు. ఇక ఆ మిగిలిన నలుగురు రెడ్లు కూడా వైసీపీ రాజకీయానికి దూరంగా మౌనంగా ఉంటున్నారు. అయితే వీరి ఈ మౌనం వ్యూహాత్మకమా.? ఉద్దేశపూర్వకమా.? అనేది తెలియాల్సి ఉంది.




