రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం షరా మామూలే. ఎన్నికల సమయంలో అయితే ఈ విరాళాల వెల్లువ వందల కోట్లల్లో ఉంటుందనేది అనధికారికంగా వ్యక్తమయ్యే సమాచారం. ఇదిలా ఉంటే, 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాల సేకరణ లెక్కలను ప్రకటించింది.

దేశంలో ఉన్న 25 ప్రధాన ప్రాంతీయ పార్టీలకు గాను మొత్తం 803.24 కోట్లు విరాళాలు సేకరించగా, ఈ మొత్తంలో 445.77 కోట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చాయని తేల్చింది. ఇందులో ఉన్న అసలు కొసమెరుపు ఏమిటంటే… గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన విరాళాల సేకరణలో మొదటి మూడు స్థానాలు మన తెలుగు పార్టీలే సొంతం చేసుకోవడం విశేషం.

Also Read – అభిమానులూ… పవన్‌ కళ్యాణ్‌కి చెడ్డపేరు తేవద్దు

89.158 కోట్లతో మొదటి స్థానంలో టీఆర్ఎస్, 81.694 కోట్లతో రెండవ స్థానంలో టిడిపి, 74.75 కోట్లతో మూడవ స్థానంలో వైసీపీ పార్టీలు ఉండగా, బిజెడి 50.586 కోట్లతో, డీఎంకే 45.50 కోట్లతో తదుపరి స్థానాలలో నిలిచాయి.