“తుంబాడ్” పేరుతో తెలుగులోకి అనువాదం అవుతోన్న బాలీవుడ్ మూవీ ఫస్ట్ టీజర్ విడుదలైంది. రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన ఈ తెలుగు టీజర్ ను అనురాగ్ కశ్యప్ విడుదల చేసారు. “ఈ విశ్వం ఏర్పడినపుడు దేవి ఈ కోటలో నుండే 16 కోట్ల దేవతలకు జన్మనిచ్చింది… తన మొదటి బిడ్డ మీద దేవికి అమితమైన ప్రేమ ఉండేది… వాడి పేరు హస్తర్..!
ఎన్నో యుగాలు గడిచిపోయాయి… హస్తర్ తన తల్లి కడుపులోనే నిద్రపోతున్నాడు…” అంటూ ప్రారంభమైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ‘హస్తర్ శాపం మనందరికీ వరం’ అంటూ చెప్పిన డైలాగ్స్… చూపించిన షాట్స్… ‘నేను నిన్ను భయపెట్టట్లేదు… తుంబాడ్ కు సిద్ధం చేస్తున్నాను…’ అంటూ వచ్చే ముగింపు డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. తుంబాడ్ మిస్టరీలు వీడాలంటే అక్టోబర్ 12వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.
ADVERTISEMENT
ADVERTISEMENT



