ఎగ్జిట్ పోల్ సర్వేలకు తమిళనాడు “అమ్మ” ట్విస్ట్?

jayalalitha-karunanidhiఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితాల సరళి అత్యధిక సంస్థలు అంచనాలు వేసినట్టుగానే వస్తున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, యూడీఎఫ్ 44, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్నాయి. అసోంలో బీజేపీ 13, కాంగ్రెస్ 1 స్థానంలో దూసుకెళ్తుండగా, పశ్చిమ బెంగాల్ లో మమత తిరుగులేని ఆధిక్యం దిశగా సాగుతోంది. తృణమూల్ ఏకంగా 97 స్థానాల్లో ముందంజలో ఉండగా, వామపక్షాలు 17, కాంగ్రెస్ 17, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యం చూపుతున్నాయి.

ADVERTISEMENT

ఈ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠను రేపిన తమిళనాడులో మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలకు విరుద్ధంగా సాగుతున్నాయి. తొలుత జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తలపడతున్నాయి. మొత్తం 234 నియోజక వర్గాలుండగా ఇప్పటి వరకూ 97 స్థానాల్లో ఫలితాల సరళి వెల్లడైంది. 52 స్థానాల్లో అన్నాడీఎంకే, 45 స్థానాల్లో డీఎంకే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

అయితే, తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య దోబూచులాడుతున్న విజయలక్ష్మి క్రమంగా జయలలిత వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా 175 స్థానాల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి కాగా, అన్నాడీఎంకే 105, డీఎంకే కూటమి 69, పీఎంకే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, జయలలిత పార్టీ స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకు రావడం ఖాయం, సర్వేలకు షాక్ ఇవ్వడం ఖాయంగా కనపడుతోంది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత తమిళనాట ఓటర్లు వరుసగా ఒకే పార్టీకి రెండు సార్లు అధికారం ఇచ్చినట్టు అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories