ఇరాన్‌ నోట 9/11 బెదిరింపు… ఊహించినదే!

US Iran conflict tensions

ఇది వరకు అమెరికా-ఇరాన్‌ తప్పకుండా ఏదో ఒక రోజు యుద్ధం విరమిస్తాయనే నమ్మకం ప్రపంచదేశాలకు ఉండేది. కానీ తాజా పరిస్థితి చూస్తున్నప్పుడు ఆ రెండు దేశాలు యుద్ధం కొనసాగించడం తప్ప మరో దారి లేనట్లే అనిపిస్తోంది.

ఇరాన్‌ మౌలిక వసతులను నాశనం చేస్తామని ట్రంప్‌ బెదిరిస్తుంటే, అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని, అప్పుడు జాతీయ సంతాప దినాలు నిర్వహించుకోవాల్సి వస్తుందంటూ ఇరాన్‌ హెచ్చరించింది.

ADVERTISEMENT

ఈ ప్రపంచ పటంలో నుంచి ఇరాన్‌ నాగరికతని సమూలంగా తుడిచిపెట్టేస్తానాన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ బెదిరింపు ఎంత తప్పో, అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని ఇరాన్‌ బెదిరించడం కూడా అంతే తప్పు.

ఇరు దేశాల పాలకులకు తమ గెలుపు, ప్రతీకారం కంటే ఏదీ ముఖ్యం కాదని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ యుద్ధోన్మాదంతో ప్రజల ప్రాణాలు తీయాలనుకోవడం, అది తప్పు కాదనుకోవడం వారి యుద్ధోన్మాదానికి పరాకాష్టగా చెప్పవచ్చు.

ట్రంప్‌ కేవలం హెచ్చరికలతో సరిపెట్టడం లేదు. ఇరాన్‌ మీద దాడులు చేస్తూనే ఉన్నారు. కనుక ఆయనని హత్య చేసేందుకు, అమెరికా మీద ఈ తరహా దాడులు చేసేందుకు ఇరాన్‌ తప్పక ప్రయత్నిస్తుందని అందరూ ఊహిస్తున్నదే. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు కూడా ఇదే చెప్పాయి కదా?

కనుక ఈ యుద్ధంలో అమెరికా-ఇరాన్‌ రెండూ భారీ మూల్యం చెల్లించక తప్పదు. దాని వలన రెండూ నష్టపోతాయే తప్ప ట్రంప్‌ కానీ ఇరాన్‌ పాలకులు గానీ గెలిచే అవకాశం ఉండకపోవచ్చు. ఈ విషయం వారికీ బాగా తెలుసు. కానీ ఇగో, పంతాలు, ప్రతీకారాలు వారిని ఈ సత్యం తెలుసుకోనీయడం లేదు. అంతే!

కనుక ఇప్పుడు ముగింపు వారి చేతుల్లో కూడా లేదు. ఆ ముగింపు ఎలా ఉంటుందో వారికీ తెలీదు. కనుక చెప్పలేరు కూడా!

ADVERTISEMENT
Latest Stories