‘ప్రధాని’ స్థానంలో ‘పోర్న్ స్టార్’ ఉంటే..!

us-mistaken-theresa-may-to-Adult starడొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లో శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. దేశ ప్రధానిని ఆహ్వానించాల్సిన శ్వేతసౌథం ‘పోర్న్ స్టార్’ను ఆహ్వానించింది. బ్రెగ్జిట్ అమలు నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పదవికి డేవిడ్ కామెరాన్ రాజీనామా చేసిన అనంతరం ప్రధానిగా థెరెస్సామే ఎన్నికవ్వనున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. అంతవరకు పెద్దగా బాహ్య ప్రపంచానికి తెలియని థెరెస్సామే కోసం ఇంటర్నెట్ లో వెతికిన వారికి థెరెస్సామే అంటూ ఓ పోర్న్ స్టార్ దర్శనమిచ్చారు. దీనిపై అప్పట్లో పలు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆ పోర్న్ స్టార్ కు సెలబ్రిటీ హోదా లభించింది.

తాజాగా త్వరలో యూఎస్ లో పర్యటించబోతున్నారంటూ శ్వేతసౌథం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో మూడు సార్లు బ్రిటిష్ ప్రధాని పేరును ప్రస్తావించింది. ఈ మూడు సార్లు థెరెస్సామే పేరులోని హెచ్ ను అనే అక్షరాన్ని వదిలేసింది. దీంతో అది పోర్న్ స్టార్ టెరెస్సామేగా మారిపోయింది. దీంతో మరోసారి పోర్న్ స్టార్ వార్తల్లో వ్యక్తి అయింది. మూడు సార్లు ఈ తప్పిదం దొర్లడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బ్రిటన్ ప్రధాని థెరెస్సామే పర్యటనలో ట్రంప్ తో పాటు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు, ఆయనతో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories