చిరంజీవి కోసం తప్పలేదనుకుంటా! ప్చ్…!

chiranjeevi vv vinayakవిక్టరీల దర్శకుడు వినాయక్ తొలిసారిగా బహిరంగ క్షమాపణ చెప్పారు. ‘అఖిల్’ సినిమా చేసి తానూ తప్పు చేసానని, ఇక మున్ముందు సినిమాలపై ఈ ప్రభావం పడనివ్వకుండా మరింత జాగ్రత్తతో సినిమాలు చేస్తానని, ఒక్క రాజమౌళి తప్ప ఇండస్ట్రీలో అందరూ తప్పులు చేసిన వారేనని, తన కెరీర్ లో మాత్రం మొట్టమొదటిసారిగా ‘అఖిల్’ సినిమా చేసి తప్పు చేసానని వినాయక్ అన్నారు.

సినీ పరిశ్రమలో జయాపజయాలు సహజమే. అయితే వినాయక్ లాంటి దర్శకుడు నుండి ఇలాంటి ప్రకటన వస్తాయని బహుశా ఇండస్ట్రీ వర్గాలు కూడా అంచనా వేసి వుండకపోవచ్చు. వినాయక్ చెబుతున్నట్లు ‘అఖిల్’ సినిమాయే వినాయక్ కెరీర్ లో ఫ్లాప్ సినిమా కాదు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి, సాంబ, యోగి, బద్రినాద్, అల్లుడు శీను’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలువలేక పోయాయన్నది వాస్తవమే. అయితే అప్పట్లో ఇప్పుడంత సోషల్ మీడియా పబ్లిసిటీ లేకపోవడంతో, ఎంత మేరకు నష్టం వాటిల్లిందో సాధారణ ప్రేక్షకుడికి తెలిసేది కాదు.

కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో, ‘అఖిల్’ సినిమా డిస్ట్రిబ్యూటర్లు 60 శాతం పెట్టుబడులను కూడా రాబట్టుకోలేక పోయారని తెలిసిపోయింది. దీంతో ఈ ప్రభావం తన మరుసటి సినిమా అయినటువంటి మెగాస్టార్ 150వ సినిమా ‘కత్తి’ రీమేక్ పై పడుతుందని భావించిన వినాయక్, ఇలా తనపై కాస్త నమ్మకం పెరిగేలా ప్రకటన చేసారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే, ఈ ప్రకటన వెనుక ‘మెగా కాంపౌండ్’ కూడా ఉందన్నది మరో వార్త. మెగాస్టార్ 150వ సినిమా వంటి ప్రేస్టెజియస్ ప్రాజెక్ట్ ను ఒక ఫ్లాప్ దర్శకుడి చేతిలో పెట్టడం ఇష్టం లేకనే, వినాయక్ ద్వారా ఈ ప్రకటన ఇప్పించి ఉంటారన్న మాటలు వినపడుతున్నాయి. దీంతో వినాయక్ పరిస్థితి చూసి ట్రేడ్ వర్గాలు “ప్చ్…” అంటూ నీరుగారుస్తున్నారట.

ADVERTISEMENT
Latest Stories