Vaishnav Tej - Ram Charanపంజా వైష్ణవ తేజ్ మొట్టమొదటి సినిమా … ఉప్పెన నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ ఓపెనింగ్ సాధించింది. మొదటి రోజు ఏకంగా 10 కోట్లకు పైగా షేర్ సాధించింది. కొత్త హీరోల మొదటి చిత్రాలలో ఇదే అత్యధిక ఓపెనింగ్.. పెద్ద స్టార్లను పక్కన పెడితే మిగతా టైర్ – 2 హీరోలలో కూడా ఇదే హైయెస్ట్.

గతంలో రామ్ చరణ్, బెల్లంకొండ శ్రీనివాస్, అఖిల్ తమ మొదటి సినిమాతో ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించారు. అయితే అందులో ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఆ తరువాత దానిని నిలబెట్టుకుని టాప్ స్టార్ గా ఎదిగాడు. వైష్ణవ్ తేజ్ మునుముందు ఎలా ముందుకు సాగుతాడో చూడాలి.

ఇక్కడ నుండి తను కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటాడు అనే దాని బట్టి కూడా అది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే అతను క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఇకపోతే ఉప్పెన హిట్ అనిపించుకోవడానికి 20 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది.

రెండో రోజు కలెక్షన్లు కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో అదేమంత కష్టం కాదు. 2020లో కరోనా కారణంగా చాలా ఇబ్బంది పడిన టాలీవుడ్ కు ఈ ఏడాది ఆశాజనకంగా మొదలయ్యింది. క్రాక్, మాస్టర్, రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, జాంబీ రెడ్డి వంటి సినిమాలు బాగా వసూళ్లు రాబట్టాయి. మిగతా ఏడాది కూడా ఇలాగే సాగి ఇండస్ట్రీకి మరిన్ని హిట్లు రావాలని కోరుకుందాం.