ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వంశీ పైడిపల్లికి వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. యుఎస్ లో ఎక్కువకాలం షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా యుఎస్ లోనే జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను దేవిశ్రీప్రసాద్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ “కృష్ణ ముకుందా మురారి” అని ఇటీవల హల్చల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి స్పష్టత ఇస్తూ… “కృష్ణ ముకుందా మురారి” గానీ, “హరే రామ హరే కృష్ణ” గానీ ఈ సినిమా టైటిల్ కాదని, ఒక్కసారి నిర్ణయించిన తర్వాత మేమే పోస్ట్ చేస్తామని స్పష్టత ఇచ్చి, టైటిల్స్ పై జరుగుతోన్న చర్చలకు శుభంకార్డు వేసారు. అంటే టైటిల్ ఇంకా నిర్ణయం జరగలేదని వంశీ పైడిపల్లి పూర్తి స్పష్టత ఇచ్చారన్న మాట.


