వంగవీటి రాధా అనే నేను…

Vangaveeti Radha Vijayawada Mayor

విజయవాడ రాజకీయాలకు వంగవీటి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అటువంటి వంగవీటి కుటుంబం కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే తాజాగా ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో బెజవాడ రాజకీయాల్లోకి వంగవీటి ప్రవేశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

కూటమి అభ్యర్థిగా జనసేన గుర్తుతో విజయవాడ మేయర్ గా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత రాయన భాగ్యలక్ష్మి పై సుమారు లక్షకు పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీనితో మొట్టమొదటిసారిగా విజయవాడ రాజకీయాల్లో జనసేన జెండా రెపరెపలాడింది.

ADVERTISEMENT

ఏపీ రాజకీయాలకు అత్యంత కేంద్ర బిందువుగా భావించే బెజవాడ మేయర్ సీటుపై మొదటి నుంచి కూటమి పార్టీలో గట్టి పోటీ నడిచింది. ఒక్క టీడీపీ పార్టీ నుంచే అనేకమంది ఆశావహులు ఈ మేయర్ సీటు కోసం పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు, పైరవీలు సాగించారు.

అయినా కూడా జనసేన పట్టుపట్టి మరీ విజయవాడ మేయర్ సీటు దక్కించుకుంది. దీనితో జనసేనలో ఆ స్థాయి రాజకీయ బలమున్న నేత ఎవరు అనే చర్చ తెరపైకి రావడంతోనే టీడీపీ నాయకుడిగా ఉన్న వంగవీటి రాధా జనసేన తీర్ధం పుచ్చుకుని కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు.

అయితే నేడు అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన మేయర్ పట్టాభిషేకం కార్యక్రమంలో విజయవాడ మేయర్ గా ‘వంగవీటి రాధాకృష్ణ అనే నేను’… అంటూ ప్రమాణస్వీకారం చేశారు. అటు పిమ్మట నగరంలోని 86 వార్డులకు గాను ప్రమాణస్వీకారం జరిగింది. దీనితో విజయవాడ నగరంలో నూతన పాలకమండలి కొలువుతీరింది.

ADVERTISEMENT
Latest Stories