ఒక ఇంటర్‌వ్యూలో వైకాపా నాయకుడు, గౌతమ్ రెడ్డి వంగవీటి మోహనరంగా మీద చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల వంగవీటి రాధ ఆగ్రహంతో ఊగిపోయారు. కాపు కులానికి తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉండటంతో దానిపై స్పందించిన వైసీపీ అధిష్ఠానం గౌతమ్‌రెడ్డిపై సస్సెన్షన్ వేటు వేసింది.
అయినా నేటికీ ఆయన వైసీపీలోనే కొనసాగుతుండటం రాధాలో అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గౌతమ్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకోవడం చర్చనీయాంశమైంది. గౌతమ్‌రెడ్డి, అయన అనుచరులు అవినాష్‌రెడ్డితో కలిసి దిగిన ఫొటో వైరల్‌గా మారింది.
అలాగే గౌతమ్ రెడ్డి మనిషి ఒకరిని జగన్ విజయవాడలో డివిషన్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఆ డివిజన్‌కు ప్రెసిడెంట్‌గా గతంలో నాగూర్ అనే వ్యక్తిని రాధా ప్రెసిడెంట్‌గా నిర్ణయించగా అతనిని జగన్ పక్కన పెట్టారు. రాధాను పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగ పెడుతున్నా రన్న వార్తలకు ప్రస్తుత పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
ఈ పరిణామాలు అన్ని రాధకు మింగుడు పడటం లేదు. గత కొన్ని రోజులుగా గా పార్టీ నాయకులకు రాధాకృష్ణ దూరంగా ఉంటున్నారు. ఫోన్లకు కూడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. పార్టీ మారాల్సిన పరిస్తితి వస్తే వంగవీటి రాధ తెదేపా వైపు చూస్తారా లేకపోతే పవన్ కల్యాణ్ జనసేన వైపు చూస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికారంగా మారింది.