చిరంజీవి కూతురు మాదిరే వరుణ్ వివాహం కూడా!

varun-marriageమెగాస్టార్ చిరంజీవి రెండవ తనయురాలు శ్రీజ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తంతు ముగిసిన తర్వాత, పెళ్లికి సంబంధించిన హైలైట్స్ అంతా కూడుకుని, ఓ వీడియోను కట్ చేసి యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేసారు. మెగా అభిమానులను ఈ వివాహానికి దూరంగా పెట్టడంతో, వారి కోసం విడుదల చేసిన పెళ్లి వీడియోను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. తాజాగా చిరు తనయురాలి వివాహం మాదిరే హీరో వరుణ్ సందేశ్ – హీరోయిన్ వృతిక సేరుల వివాహం కూడా జరిగిందన్న విషయం స్పష్టమైంది.

వరుణ్ – వృతికల పెళ్లికి సంబంధించిన హైలైట్స్ ను కట్ చేసి, ఓ 7 నిముషాల నిడివి గల వీడియోను విడుదల చేసాడు హీరో వరుణ్ సందేశ్. వృతికను పెళ్ళికూతురు చేసే నాటి నుండి మొదలైన ఈ వీడియోలో వరుణ్ వివాహం ఆత్మీయుల నడుమ అత్యంత ఘనంగా జరిగింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో… పెళ్లి పందిరిలో వరుణ్ – వృతికల హంగామాకు కొదవలేదు. అలాగే సంగీత్ లో వీరిద్దరూ స్టెప్పులు వేసి… “ఒకరికోసం ఒకరం” అన్నట్లుగా పెనవేసుకున్న తీరు… వీరి మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories