AK47 టీజర్: త్రివిక్రమ్ మార్క్ ఎక్కడ?

AK47 teaser featuring Trivikram and Venkatesh

త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (AK47) ఫస్ట్ టీజర్ బయటకు వచ్చింది. దీనికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.

ఒక వర్గం టీజర్‌ను ఇష్టపడుతుంటే, అంతే స్థాయిలో నెగెటివ్ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

ముఖ్యంగా, “ఇది త్రివిక్రమ్ సినిమా కాదు… అనిల్ రావిపూడి సినిమా” అనే పోలిక ఎక్కువగా వినిపిస్తోంది.

టీజర్‌లో పెద్దగా excitement లేదా freshness కనిపించకపోవడం ప్రధాన సమస్య.

తమన్ మ్యూజిక్ కూడా అనుకున్న స్థాయిలో impact ఇవ్వలేకపోయింది. దీంతో టీజర్‌పై ఆసక్తి పెరగాల్సింది పోయి, సినిమా ఎలా ఉండబోతోందనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇకపై వచ్చే promotional material చాలా కీలకం. ముఖ్యంగా trailerలో మ్యూజిక్, డైలాగ్స్ బలంగా ఉండాలి. అవే సినిమాపై pre-release anticipation తీసుకురావాలి.

రిలీజ్‌కు సమయం కూడా దగ్గరపడుతోంది. త్రివిక్రమ్ తనదైన మార్క్ చూపించాలి. అనిల్ రావిపూడి తరహా సినిమా అనే పోలికను దాటి, థియేటర్లలో చూడాలనే excitement తీసుకురావాలి. ఇప్పుడు AK47కి కావాల్సింది అదే.

ADVERTISEMENT
Latest Stories