చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ మళ్ళీ వెండితెరపై దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ‘దృశ్యం’ సినిమా తర్వాత కాస్తంత విరామం తీసుకున్న వెంకటేష్… బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నట్లు… అదిరిపోయే లుక్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన స్థాయి హీరోలు బాలకృష్ణ, నాగార్జునలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటుంటే, తానూ మాత్రం ఎందుకు వెనుకపడతాను… అన్న రీతిలో ‘బాబు బంగారం’ తొలి టీజర్ ఉంది.
48 సెకన్ల టీజర్ కు కూడా రెండు భాగాలు ఉండడం విశేషం. ఫస్టాఫ్ లో హీరోయిన్ నయనతారతో ఆహ్లాదకరంగా కనిపించిన వెంకీ, సెకండాఫ్ లోపవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ కృష్ణగా ‘అయ్యో అయ్యయ్యో…’ అంటూ నవ్వులు పూయించారు. మొత్తమ్మీద ఎలాంటి అంచనాలు లేనటువంటి ‘బాబు బంగారం’ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా ఎదురుచూసేలా టీజర్ ఉంది. వెంకీ ఫ్యాన్స్ కు కూడా ఫెస్టివల్ టైం వచ్చింది..!
ADVERTISEMENT
ADVERTISEMENT



