వైరల్ : అయ్యో… అయ్యో… అయ్యయ్యో..!

Vennkatesh watches IPL in the stadiumవిక్టరీ వెంకటేష్ లేకుండా హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా? ఖచ్చితంగా కాదనే సమాధానమే లభిస్తోంది. క్రికెట్ అంటే చెవి కోసేసుకునే వెంకీకి ఐపీఎల్ రూపంలో మళ్ళీ పండగ వాతావరణం వచ్చింది. సోమవారం నాడు హైదరాబాద్ వేదికగా జరిగిన రాజస్తాన్ రాయల్స్ – సన్ రైజర్స్ మ్యాచ్ లో వెంకీ ప్రత్యక్షం అయ్యాడు.

సన్ రైజర్స్ జెండా పట్టుకుంటూ హంగామా చేసిన వెంకీ, జట్టు లక్ష్య చేధనలో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) పరుగులకే వెనుదిరిగిన సమయంలో… వెంకీ ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కోల్పోయిన ఏకైక వికెట్ సాహాదే కావడం విశేషం. 127 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే చేధించి ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories