ప్రతి ‘సంబరం’ వెనుక ఒక ‘యుద్దమే’నా.?

greater-kalesh-review-a-feel-good-diwali-treat

చెడు పై మంచి సాధించిన ప్రతి విజయం వెనుక ఒక యుద్ధమే ఉంటుంది, అలాగే అధర్మం పై ధర్మం గెలిచిన ప్రతి సందర్భంలోను రక్తపాతమే కనిపిస్తుంది. ఇందుకు మన పురాణ ఇతిహాసాలలో ఎన్నో కథలు, గాధలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

ఒక మహా భారతం తీసుకుంటే అధర్మం పై ధర్మం గెలిచిన కురుక్షేత్ర మహాసమరంలో లక్షల కొద్ది ప్రాణాలు బలిగొన్న తరువాత కానీ ధర్మం గెలవలేదు. మహా యోధుల మరణాల తరువాత కానీ అధర్మం తలవంచలేదు.

ADVERTISEMENT

కౌరవుల పై పాండవుల సాధించిన ఈ విజయం వెనుక జరిగిన రక్త పాతం ఇప్పటికి చరిత్ర మరవలేకపోతుంది. అయితే అంతటి రక్తపాతం జరిగితే కానీ అధికారం ధర్మం చేతికి రాలేదు, అలాగే ధర్మబద్ధంగా రాజ్యపాలన జరగలేదు.

ఇక మహిషాసురుడు అనే రాక్షస వదతోనే దసరా సంబరాలు జరుపుకుంటారు. అయితే ఈ వద వెనుక కూడా అనేకమంది వేదనలు, ఆర్తనాదాలు ఉన్నాయి. అలాగే ఒక స్త్రీ యొక్క శక్తి సామర్ధ్యాలు – ధైర్య సాహసాలు కనిపిస్తాయి.

మహిషాసురుడు అనే రాక్షసుడు అరాచకానికి అంతం పలికే ప్రక్రియలో భాగంగా కాళికాదేవి అవతారంలో ఉద్భవించిన దుర్గా మాత తొమ్మిది రోజుల పాటు ఆ రాక్షసుడి తో ఘోర యుద్ధం చేసి చివరికి ధర్మాన్ని గెలిపించారు.

ఈ గెలుపు వెనుక తొమ్మిది రోజుల యుద్ధం దాని తాలూకా రక్తపాతం దాగుంది. అయితే ఈ యుద్ధమే ఒక వేడుకకు ప్రాణం పోసింది. ఒక మగువ యొక్క మహుగ్రరూపాన్ని చరిత్ర లా మారింది.

అలాగే ఇటు దీపావళి పండుగ సంబరాల వెనుక కూడా యుద్ధమే దాగుంది, నరకాసురిడి అకృత్యాలకు, అన్యాయాలకు ముగింపు పలికే క్రమంలో శ్రీ కృషునిని సతీమణి సత్యభామ చేతుల మీదుగా ఈ నరకాసుర సంహారం జరిగింది.

దీనితో అప్పటి వరకు నరకాసురిడి చర్యలతో, చేష్టలతో తమ జీవితాలు చీకటి అయిపోతున్నాయి అని భావించిన ప్రతి ఒక్కరు ఆయన మరణంతో తమ జీవితాలలో తిరిగి వెలుగు ప్రసరించింది అనే ఆనందంలో తమ ఇంట్లో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు.

చీకటి – వెలుగు మధ్య సాగిన ఈ యుద్ధం దీపావళి పండుగకు ఆజ్యం పోసింది. ఇలా భారతీయ సంసృతిలో జరుపుకునే ప్రతి పండుగ వెనుక అంతర్భాగంగా ఒక యుద్ధం ఉంటూనే ఉంటుంది. అలాగే ఒక అధర్మం పై ధర్మం ఎప్పుడు పోరాడుతూనే వస్తుంది.

అయితే దాని తాలూకా విజయాల ఫలితం సాధించడానికి కాస్త సమయం పట్టినా చివరికి ధర్మమే నెగ్గుతుంది, నెగ్గి తీరుతుంది అనేది మన చరిత్ర చెపుతుంది. అయితే నాటి ఈ ధర్మ యుద్ధాలే నేడు మన పండుగలుగా మారాయి.

దసరా సరనవత్రాలు ముగిసిన తరువాత జరుపుకునే పండుగ దీపావళి. ఇంటి ముందు పూలతో అలంకరించి, ముంగిట రంగవల్లిలు దిద్దుకుని, లక్ష్మీ దేవి పూజ చేసుకుని, దీపాలు వెలిగించి, వీధులలో టపాసులు పేల్చుకుని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఎంతో సరదాగా జరుపుకునే పండుగే ఈ దీపావళి.

ఈ పండుగ ప్రజలందరి జీవితాలలో వెలుగు నింపాలని, రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ “M9” తరుపున రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు “హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి”.

ADVERTISEMENT
Latest Stories