రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు సెలబ్రిటీలు!

Vidya Balan met with a minor accidentప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. 38 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ, ముంబైలోని బాంద్రాకు ఓ మీటింగ్ కోసం వెళుతుండగా… ఆమె కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయినప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడం చెప్పుకోదగ్గ విషయం. కారుకు అయిన డ్యామేజ్ చూస్తే… ఈ ఘటనలో చిన్న గాయం కూడా కాకుండా విద్యాబాలన్ ఎలా బయటపడిందా? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. ప్రస్తుతం విద్యాబాలన్ లేట్ నైట్ రేడియో జాకీ పాత్రను పోషిస్తున్న ‘తుమ్హారీ సులూ’ సినిమా నవంబర్ 24న విడుదలకు సిద్ధమైంది.

ADVERTISEMENT

ఇక టాలీవుడ్ తో పాటు, దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించిన నటి సింధుమీనన్ తల్లి శ్రీదేవి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం నాడు తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బెంగళూరులోని మత్తికెర సర్కిల్ వద్ద ఆటో ఎక్కగా, ఇంతలో ఆటోను వెనక నుంచి వచ్చిన ఓ క్యాబ్ ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న సింధుమీనన్ తల్లి గాయాల పాలయ్యారు. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడం మానేసి… ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇద్దరూ గొడవకు దిగారు. చుట్టుపక్కల వారు కూడా సాయానికి రాకపోవడంతో, తన బంధువులకు ఫోన్ చేయగా, సింధు సోదరుడు స్థానిక రామయ్య ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు.

ADVERTISEMENT
Latest Stories