‘రిలీజ్’కు ముందు ‘రెండు నిముషాల’ సినిమా ‘రిలీజ్’

Vijay Antony - Yaman Trailer‘బిచ్చగాడు’ సినిమాతో తనకంటూ మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న విజయ్ అంటోనీ, తాజాగా ‘యమన్’ సినిమాతో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘భేతాళుడు’ సినిమా ప్రమోషన్ తరహాలోనే ఈ సినిమాకు విడుదలకు ముందు రెండు నిముషాల సన్నివేశాన్ని చిత్ర యూనిట్ యూ ట్యూబ్ లో విడుదల చేసారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ ఆసక్తికర సన్నివేశాన్ని రిలీజ్ చేసారు.

జైలులో విజయ్ కు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తికే విజయ్ వార్నింగ్ ఇచ్చిన ఈ సన్నివేశం మామూలుగానే ఉన్నా, పొలిటికల్ అంశాలు మేళవించి ఉండడంతో మిక్కిలి ఆసక్తికరంగా మారింది. డిఫరెంట్ కధంశాలను ఎంచుకునే విజయ్ ఖాతాలో మరో వినూత్నమైన సినిమాగా ‘యమన్’ నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ‘బిచ్చగాడు’ ప్రభావంతో ఈ ‘యమన్’కు కూడా ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని భావిస్తున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories