ఎన్టీఆర్ చేసిన సాహసం చెయ్యడానికి సిద్ధం అవుతున్న దేవరకొండ

Vijay Deerakonda as stutter guy in puri jagannadhహప్పెనింగ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో ఒక పెద్ద ప్లాప్ మూటగట్టుకున్నాడు. నేను నటుడిని, నేను ఉన్నది నటించడానికే గానీ ఆడియన్స్ ను మెప్పించడానికి కాదు అని డియర్ కామ్రేడ్ ప్రెస్ మీట్ లోనే ధైర్యంగానే చెప్పేశాడు. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు హీరో. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్టుని వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. టిపికల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈసినిమా రూపొందబోతోంది.

ADVERTISEMENT

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తి సమస్యతో ఉన్న కుర్రాడిగా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ..నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపించారు. ఇలాంటి పాత్రలతో తమలో ఉన్న నటన ను మరింతగా బయిటపెట్టడానికి వీలుంటుందని ఎన్టీఆర్ చేసిన ఆ సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు విజయ్ కూడా అదే సాహసం చెయ్యబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ఏ బ్యానర్‌లో చేయాలనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ ఇప్పటికే చాలా మంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు తీసుకున్నాడు. వారిని కాదని సినిమా చేసే పరిస్థితి లేదు. దాంతో విజయ్‌ దేవరకొండ ఒప్పుకున్న నిర్మాతకి పూరి సినిమా చేయాల్సి వుంటుంది. కానీ పూరి జగన్నాధ్‌ మాత్రం ఇప్పుడు బయటి బ్యానర్‌లో ఇష్టపడటం లేదట. సొంతంగా తానే సినిమాలను నిర్మిస్తున్నాడు. దీనితో ఇది ఎటు తేలుతుంది అనేది చూడాలి. విజయ్ కు ప్రస్తుతం క్రాంతి మాధవ్ తో ఒక సినిమా ఉంది. అలాగే హీరో అనే బైలింగ్వల్ సినిమా ఉంది.

ADVERTISEMENT
Latest Stories