ప్రభాస్, ఎన్టీఆర్ లకు చెక్ పెట్టాడు!

Vijay Devarakonda Arjun reddy2017లో తెలుగు సినిమా వెలిగిపోతోంది. నిజమే… గతంతో పోల్చుకుంటే తెలుగు సినిమాల సక్సెస్ రేటు బాగా పెరిగింది. అలాగే ‘బాహుబలి 2’తో తెలుగు సినిమా గురించి ప్రపంచమే మాట్లాడుతోంది. అలాగే నటీనటులు కూడా పోటీపడి మరీ అభినయిస్తూ ఓ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇండస్ట్రీలో పాతుకుపోయిన సినీ వారసులతో పాటు కొత్తతరం వారు కూడా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలలో అద్భుతంగా నటిస్తుండడంతో తెలుగు సినిమాకు సక్సెస్ రేటు బాగా పెరిగిందని చెప్పాలి.

ADVERTISEMENT

ఈ ఏడాదిలో ‘బాహుబలి 2’ విడుదలైన తర్వాత… ‘ఉత్తమ నటుడు’ ప్రభాస్ మొదలుకొని మెజార్టీ అవార్డులన్నీ ఈ సారి ‘బాహుబలి 2’కే అన్న భావన యూనివర్సల్ గా వ్యక్తమైంది. ఈ ఏడాది సెకండాఫ్ లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ వంటి అగ్ర హీరోలు వస్తున్నా… అందులో ‘జై లవకుశ’ సినిమాలో మూడు పాత్రలు చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రమే స్ట్రాంగ్ కంటేండర్ గా సినీ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. అయితే ఇంతలో “అర్జున్ రెడ్డి” సినిమా ద్వారా విజయ్ దేవరకొండ అనూహ్యంగా తెరపైకి వచ్చాడు.

అవును… ఓ సాధారణ హీరో అయిన విజయ్, “అర్జున్ రెడ్డి” సినిమాలో ప్రదర్శించిన అద్వితీయమైన ప్రదర్శనకు గానూ ‘ఉత్తమ నటుడు’ విభాగంలో ప్రభాస్, ఎన్టీఆర్ లకు గట్టిపోటీనిచ్చే విధంగా కనపడుతున్నాడు. ఒక సినిమా హిట్టు కావడం వేరు, అందులో నటీనటుల అభినయాల గురించి మాట్లాడుకోవడం వేరు. విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” విషయంలో ఈ రెండూ జరగడంతో, 2017 ‘ఉత్తమ నటుడు’ విభాగంలో ఉన్న ప్రభాస్, ఎన్టీఆర్ లకు చెక్ చెప్తున్నాడు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ రేసులో విజయ్ గెలిచినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

ADVERTISEMENT
Latest Stories