ఇది నా యాటిట్యూడ్… ఇలాగే ఉంటా… – దేవరకొండ!

vijay-devarakonda  on his attitude“గీత గోవిందం” హిట్ తో మళ్ళీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. దీంతో ప్రస్తుతం ఈ హీరో ఏం చెప్పినా, ఏం చేసినా అవి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ గురించి విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

[m9ad]

ADVERTISEMENT

ఆఫ్ స్క్రీన్ లో తనకు నచ్చినట్టు తాను ఉంటాను, అలాగని నేను అందరికీ నచ్చాలని లేదని, అందరి వ్యక్తులు మనకు నచ్చరు, ఎవరి టేస్ట్ లు వారికుంటాయి, అది మనం అంగీకరించాలి, అయినా ఆఫ్ స్క్రీన్ లో నేను ఎలా ఉన్నానన్నది ఎవరికీ ముఖ్యం కాదని అన్న విజయ్, ఆన్ స్క్రీన్ లో మాత్రం అందరికీ నచ్చే విధంగా ఉండాలన్నది తమ అభిమతమని అభిప్రాయపడ్డారు.

“గీత గోవిందం” సినిమా చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని, ఈ సబ్జెక్ట్ అన్ని వర్గాల వారికి చేరువయ్యేది కనుక నటించానని, ఆఫ్ స్క్రీన్ లో నా జీవితం, నా ఫన్ ఉండాలని కోరుకుంటానని, ఆన్ స్క్రీన్ లో నా ప్రతి క్యారెక్టర్ అందరికీ నచ్చాలని ఆశిస్తానని… తనదైన శైలిలో సింపుల్ గా చెప్పుకొచ్చారు ఈ ఫ్యూచర్ స్టార్ హీరో.

ADVERTISEMENT
Latest Stories