విజయ్ దేవరకొండ వల్ల కూడా కాలేదు!

Vijay Devarakonda -Savyasachi - Audio Launchచందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తోన్న “సవ్యసాచి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసింది. నిజానికి ఈ ఈవెంట్ జరిగిందన్న విషయమే తెలియనంతగా సినీ ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏదో ఫార్మాలిటీలో భాగంగా చిత్ర యూనిట్ అంతా ఒకరినొకరు మాట్లాడుకుని ప్రశంసలు, కృతజ్ఞతలు అందజేశారే తప్ప, మొత్తం ఈవెంట్ లో అసలు పస లేకుండా పోయింది.

ADVERTISEMENT

[m9ad]

చివరి నిముషంలో విజయ్ దేవరకొండ రావడంతో, సహజంగా విజయ్ ప్రసంగంపై ఉండే అంచనాల రీత్యా “సవ్యసాచి”కి తగినంత పబ్లిసిటీ లభిస్తుందని భావించగా, స్టేజ్ పైన విజయ్ ‘ఫ్లాష్ బ్యాక్’ స్టోరీ చెప్పి ఆశ్చర్యపరిచారు తప్ప, సినిమాకు ఉపయోగకారిగా ఉండే డైలాగ్స్ వేయలేకపోయారు. ఇక చైతూ ప్రసంగంలో ‘ఫ్లో’ లేకపోగా, ఏదో పట్టుబట్టి చెప్పినట్లుగా అంతా కృత్రిమంగా ఉంది.

దీంతో “సవ్యసాచి” ఓపెనింగ్స్ భారమంతా ‘కంటెంట్’ పైనే పడింది. చందు మొండేటి – మైత్రీ మూవీ మేకర్స్ ట్రాక్ రికార్డ్ ప్రధాన ప్లస్ పాయింట్స్ కాగా… ఏదో కొత్తదనం లేకుండా పాత్రలను ఒప్పుకొని మాధవన్ ఈ సినిమాలో చేయడం మరో కీలకమైన అంశం. సంగీత పరంగా కీరవాణి నిరుత్సాహపరచగా, బ్యాక్ గ్రౌండ్ తో సిల్వర్ స్క్రీన్ పై అదరగొడతారేమో చూడాలి. నవంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా “సవ్యసాచి” విడుదల కానుంది.

ADVERTISEMENT
Latest Stories