“టాక్సీవాలా” గురించి దేవరకొండ హింట్స్!

Vijay Deverakonda hints about taxiwala movieప్రస్తుతం “గీత గోవిందం” సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ లో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొండ, తదుపరి సినిమాగా “టాక్సీవాలా” విడుదల కానుంది. నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాలను చూపుతూ వాయిదాలు వేస్తూ వచ్చారు. అయితే ఈ ‘గీత గోవిందం’ సినిమాతో పాటు ‘టాక్సీవాలా’ కూడా లీక్ అయ్యిందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

[m9ad]

ADVERTISEMENT

దీంతో ఈ సినిమాను నేరుగా డిజిటల్ మీడియాలో రిలీజ్ చేయాలని కూడా భావిస్తున్నట్లుగా టాక్ వచ్చినప్పటికీ, అలాంటి ఆలోచనలేవీ లేవన్న సంకేతాలను విజయ్ అందించాడు. ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ… “త్వరలోనే మరో కొత్త ఎక్స్ పీరియన్స్ తో మళ్ళీ కలుద్దాం… బీ రెడీ…” అంటూ విస్పష్టమైన వ్యాఖ్యలు చేసారు. అంటే అతి త్వరలోనే “టాక్సీవాలా” ధియేటర్లలో ప్రత్యక్షం కానుందన్న మాట.

ఇదిలా ఉంటే “గీత గోవిందం” మూవీ యుఎస్ లో 2 మిలియన్ మార్క్ ను అందుకునేలా కనపడుతోంది. ఇప్పటికే 1.5 మిలియన్ దాటిన ఈ సినిమా కలెక్షన్స్ నెక్స్ట్ వీకెండ్ కు 2 మిలియన్స్ ను సొంతం చేసుకోవడం నల్లేరు మీద నడకేనని భావించవచ్చు. దీంతో అగ్ర హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకుంటూ సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాడు ఈ “రౌడీ స్టార్” హీరో.

ADVERTISEMENT
Latest Stories