ఒకే విషయాన్ని రెండు వేరు వేరు కోణాల నుండి చుసిన నాని, దేవరకొండ

Vijay Deverakonda - Sai Pallaviఈరోజు విజయ్ దేవరకొండ, సాయి పల్లవిల పుట్టినరోజులు. సహజంగా పెద్ద స్టార్ల పుట్టినరోజులు సందర్భంగా వారు చేస్తున్న సినిమాల నుండి ఎవరో ఒకటి రిలీజ్ కావడం మాములే. అందుకోసం ఆడియన్స్, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు. అయితే ఈరోజు విజయ్ చేస్తున్న లైగర్, నాని చేస్తున్న శ్యామ్ సింఘా రాయ్ టీంలు రెండు వేరువేరు నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనా కారణంగా జనాలు ఇబ్బందుల్లో ఉన్నారని… ఇటువంటి సమయంలో తమ సినిమా టీజర్ విడుదల చెయ్యడం సబబు కాదని చెప్పి లైగర్ టీమ్ తమ వద్ద ఇప్పటికే రెడీగా ఉన్న టీజర్ ను కూడా ఇంకో రోజుకు వాయిదా వేసింది. మరోవైపు… నాని స్వయంగా శ్యామ్ సింఘా రాయ్ లోని సాయి పల్లవి లుక్ ని విడుదల చేశాడు.

ADVERTISEMENT

కరోనా కారణంగా ఇంటి నుండి కాలుబయటకు పెట్టలేని ప్రేక్షకులను కొంచెం చీర్ అప్ చెయ్యడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్రబృందం చెబుతుంది. అన్నట్టుగానే సాయి పల్లవి లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఒకే విషయాన్ని ఇద్దరు హీరోలు రెండు వేరు వేరు కోణాల నుండి చూడటం విశేషం.

విజయ్ దేవరకొండ నిర్ణయంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా లేట్ అయ్యింది. సెప్టెంబర్ లో విడుదలకు ప్లాన్ చేసిన ప్రస్తుత పరిస్థితిలో ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. కనీసం ఒక టీజరైన విడుదల చేసి ఉంటే తమ అభిమాన హీరోని చూసుకుని సంతోషపడేవాళ్ళం కదా అని వారు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories