ప్రస్తుత కాలంలో ఒక సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ముఖ్యం. విడుదలకు కొద్ది రోజుల ముందు నిర్వహిస్తోన్న ఈ ఈవెంట్ సక్సెస్ అయితేనే, ఆయా సినిమాలకు తగినంత పబ్లిసిటీ దక్కుతోంది. మరి అలాంటి పబ్లిసిటీ సొంతం చేసుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, తన “టాక్సీవాలా” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కావల్సినంత స్టఫ్ ను అందించారు.
[m9ad]
రెగ్యులర్ గా సాంకేతిక నిపుణులను అభినందిస్తూ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ, ఈ సినిమాను పైరసీ చేసిన వారికి ఈ నెల 17వ తేదీన తన ‘మిడిల్ ఫింగర్’ను చూపించడానికి రెడీ అవుతున్నానని, మీరు కూడా ధియేటర్లలో ఈ సినిమాను చూసి మిడిల్ ఫింగర్ ను చూపించడానికి సిద్ధం కండి అంటూ పిలుపునిచ్చి ఈవెంట్ ను టాక్ ఆఫ్ ది టౌన్ చేసారు.
‘టాక్సీవాలా’ సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఎవరెన్ని చెప్పినా మీరు నమ్మవద్దు అంటూ పరోక్షంగా విడుదల తర్వాత రాబోయే రివ్యూల గురించి ముందే ప్రస్తావించారు. నేను సినిమా చూసాను, చాలా బాగా వచ్చింది, నా మాట నమ్మండి… అంటూ విజయ్ దేవరకొండ సినీ ప్రేక్షకులలో తనదైన విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసారు.
ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అర్జున్ కూడా తనదైన శైలిలో ప్రసంగించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేసిన అల్లు అర్జున్, తన కంటే స్టార్ గా విజయ్ దేవరకొండ ఎదిగినా తనకు మరింత సంతోషం కలిగించే విషయమని తెలిపాడు. అయితే యధావిధిగా పైరసీ వచ్చేపాటికి ఏమోషనల్ కు గురైన స్టైలిష్ స్టార్, ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.



