విజయసాయి రెడ్డి మీద ఉన్న ప్రేమ దేవుడి మీద లేదు

Vijaya Sai Reddy -Vijaya Sai Reddy Nara Chandrababu Naidu (2)విజయనగరం జిల్లాలోని రామతీర్థంలోని పురాతన ఆలయంలో రాముడి విగ్రహం కొందరు దుండగులు ఇరగ్గొట్టి కోనేరులో పడేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. దీనితో ప్రభుత్వం మీద భారీగా ఒత్తిడి వస్తుంది. అయితే కేసులో మాత్రం ఎటువంటి పురోగతి ఇప్పటిదాకా నమోదు కాలేదు.

ADVERTISEMENT

అదే సమయంలో గత వారం అక్కడకి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు యాత్రను భగ్నం చెయ్యడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా అక్కడకు వచ్చి హంగామా చేశారు. అయితే ఈ సందర్భంగా అక్కడ స్థానికులు ఆయన మీద చెప్పులు, రాళ్ళూ రువ్వారు.

ఈ సందర్భంగా తన మీద దాడికి చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకుల మీద కేసు పెట్టారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు మీద ఏకంగా పీడీ యాక్టు కేసులు పెట్టారు స్థానిక పోలీసులు… కేసుకు సంబంధించిన అరెస్టులు కూడా చెయ్యడం మొదలుపెట్టారు. విగ్రహం పగులగొట్టిన కేసులో మాత్రం ఎటువంటి పురోగతి లేకపోవడం గమనార్హం.

దీనిబట్టి ఈ విషయంలో అటు పోలీసులకు గానీ ఇటు ప్రభుత్వానికి గానీ ఎంతమేర చిత్తశుద్ధి ఉంది అనేది చెప్పవచ్చు. విజయసాయి రెడ్డి మీద ఉన్న ప్రేమ దేవుడి మీద లేదు అంటూ స్థానికులు అధికార పార్టీ మీద మండిపడుతున్నారు. మరోవైపు… బీజేపీ, జనసేన రేపు చలో రామతీర్ధం అని పిలుపునిచ్చాయి.

ADVERTISEMENT
Latest Stories