చంద్రబాబు మొదలుపెట్టిన మంచి సంస్కారం కొనసాగించలేకపోయారు..

vijaysai reddy comments on chandrababu naidu on his birthdayచంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న రాజకీయ వైరం అందరికీ తెలిసిందే. జగన్ అయితే ఏకంగా చంద్రబాబును ఉరి వేసెయ్యాలి… కాల్చి చంపేయ్యాలి అనేదాకా వెళ్లారు కూడా. అయితే 2017 లో చంద్రబాబు ఒక మంచి సంప్రదాయానికి తెరలేపారు. ఆ ఏడాది జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్విట్టర్ లో జగన్ కు విషెస్ చెప్పారు.

దానికి అందరితోపాటు జగన్ కు సర్ప్రైజ్ అయ్యారు. అప్పటి నుండి మాములు రోజుల్లో ఎలా ఉన్నా… ఏమనుకున్నా ఒకరి పుట్టినరోజుకు ఒకరు విష్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈరోజు చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆ మంచి సంప్రదాయానికి తెరదించారు.

ADVERTISEMENT

ఉదయమే తనదైన శైలిలో శాపనార్ధాలు పెడుతూనే చంద్రబాబు కు విష్ చేశారు. అలాగే తమ పార్టీ ఐటీ సెల్ తో ఒక బ్యాడ్ హాష్ టాగ్ ను కూడా ట్రెండ్ చేయించారు. పుట్టినరోజు కూడా ఇటువంటి మాటలా అంటూ కొందరు విస్తుపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులలోని ఒక చిన్న శాతం కూడా ఆ ట్వీట్ మీద పెదవి విరిచారు.

అయితే అంతటితో ఆగకుండా ఇంకో రెండు గంటలకు అటువంటి ట్వీట్ నే ఇంకోటి వేశారు. ఇక ఈయన మారడు అని జనాలు అనుకునేలా! ఇక ఆ తరువాత చంద్రబాబు ను విష్ చేస్తూ… ఇదంతా తెలియనట్టు ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. దానికి చంద్రబాబు థాంక్ యూ చెప్పుకున్నారు. అయితే ఇటువంటి విష సంస్కృతి మధ్య మన పిల్లలు పెరుగడం ఎంతవరకు మంచిది అని ముఖ్యమంత్రి అలోచించి తమ వారికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ADVERTISEMENT
Latest Stories