వావ్… వాట్ ఎ స్టైలిష్ పిక్చర్..!

Iru Mugan, Iru Mugan Photos, Iru Mugan Movie Photos, Vikram Iru Mugan Photos, Vikram Nayanatara Iru Mugan Photos, Iru Mugan Stylish Photosహారిస్ జయరాజ్ సంగీతం అందించిన ‘ఇరుముగాన్’ సినిమా ఆడియో ఆగష్టు 2వ తేదీన విడుదల కానున్న నేపధ్యంలో… ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు అత్యంత ఆకర్షణీయంగా, వీక్షకులను కట్టిపడేసేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవల కాలంలో బీచ్ ఒడ్డున ‘చియాన్’ విక్రమ్, నయనతారల ఫోటో హల్చల్ చేసి, టాక్ ఆఫ్ టౌన్ గా మారగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

గన్ పట్టుకుని చియాన్… ఆ వెనుక హోయలు పోతూ నడుస్తున్న నయనతారలు ఉన్న స్టిల్ స్టైలిష్ గా, వీక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు ఈ సినిమా చాలా స్టైలిష్ గా తెరకెక్కిందన్న విషయాన్ని స్పష్టం చేసాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

తమిళంలో ‘ఇరుముగాన్’గా ఉన్న సినిమా తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో డబ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ తో ‘పులి’ వంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మించిన శిబు థామీన్స్ ఈ సినిమాకు నిర్మాత. విక్రమ్ కెరీర్ లో మరో ప్రయోగాత్మక సినిమాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘ఇంకొక్కడు’ నిలిచిపోవడం ఖాయం అంటున్నారు ‘చియాన్’ అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories