ఒక్క ఫెయిల్యూర్: గతాన్ని మరిచేలా చేసిందా? భవిష్యత్ ను సంకటంలో పడేసిందా.?

Virat Kohli Faces Form Slump After Comeback Series

టి-20 మరియు టెస్ట్ ఫార్మటు ల నుండి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత విరాట్ వన్-డే ల కు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే, ఎప్పుడో జూన్ నెలలో ఐపీఎల్ లో దర్శనమిచ్చిన కోహ్లీ, మరల 4 నెలల అజ్ఞాతవాసం తరువాత ఆస్ట్రేలియా సిరీస్ లో దర్శనమిచ్చాడు.

ఇంటర్నేషనల్ లో కం-బ్యాక్ సిరీస్ కానుండటంతో అభిమానులు ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ తన మునుపటి ఆటతో విశ్వరూపం చూపిస్తాడు అంటూ సిరీస్ మొదలవక ముందే హైప్ పెంచేసుకున్నారు. కట్ చేస్తే కోహ్లీ చెలరేగడం కాదు కదా, రెండు మ్యాచ్లలోను డక్-అవుట్ గా వెనుదిరగటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ADVERTISEMENT

దానికి తోడు ఈ సిరీస్ ఇప్పటికే 0 – 2 తో ఆస్ట్రేలియా టీం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒకపక్క కోహ్లీ ఫెయిల్యూర్ మరో పక్క టీం వరుస ఓటములు భారత ఆటగాళ్ళను సందిగ్ధంలో పడేశాయి. దీనితో సిరీస్ ప్రారంభానికి ముందు ఉన్న ఊపు- ఉత్సాహం కోహ్లీ అభిమనులలో కొరవడింది.

సోషల్ మీడియా మొత్తం ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. కోహ్లీ ఎంతటి నైపుణ్యం ఉన్న బ్యాటర్ అని కేవలం మన దేశపు అభిమానులు, క్రికెటర్లే కాదు, విదేశీ ఆటగాళ్ళు సైతం నిర్మొహమాటంగా ఒప్పుకుంటారు. మరి అంతటి బ్యాటర్ వరుసగా రెండు మ్యాచ్లలో డక్-అవుట్ అవటం కోహ్లీ గత చరిత్రను విమర్శలతో కప్పేసింది అలాగే భవిష్యత్ ను ప్రశ్నలతో నింపేసింది.

గతంలో విరాట్ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లోనూ ఇలా వరుసగా రెండు డక్-ఔట్లు చూసిందే లేదు. గతంలో 2016 టి-20 వరల్డ్ కప్ లో పాక్ మరియు ఆసీస్, 2022 టి-20 వరల్డ్ కప్ లో పాక్ పై కొట్టిన 82 పరుగులు, 2 టి-20 వరల్డ్ కప్ ‘మ్యాన్ అఫ్ ది టోర్నీ’, 2023 వరల్డ్ కప్ లో 700+ పరుగులు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్, కెరీర్ లో 80+ సెంచురీలు, మరెన్నో మరువలేని ఇన్నింగ్స్ ల ను ఆడాడు విరాట్.

ఇలా ఒకటి-రెండు గణాంకాలతో విరాట్ దేశానికి చేసిన సేవలను గుణించలేము. మరి ఫ్లాష్-బ్యాక్ లో ఇంతటి రాజసాన్ని మోసిన విరాట్ కోహ్లీకి నేడు ఒక్క సిరీస్ ఫెయిల్యూర్ కారణంగా తన భవిష్యత్ క్లిష్టంగా మారుతుందంటే సగటు కోహ్లీ అభిమాని ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇప్పటికే జట్టులో విరాట్-రోహిత్ ల స్థానాలకు ఎటువంటి ప్రత్యేకత లేదు అని కోచింగ్ సభ్యులు క్లారిటీ ఇవ్వటంతో, 3వ వన్-డే విరాట్ తన బ్యాట్ కు పనిచెప్పక తప్పదు. చూడాలి మరి ఎన్నో ఒత్తిడులను,మరెన్నో కీలక మ్యాచ్లను సునాయాసంగా దాటొచ్చిన విరాట్ కోహ్లీ, నేడు తన కెరీర్ ను డిసైడ్ చేసే 3వ వన్-డే లో తనపై వచ్చిన ప్రశ్నలకు, తన ఫామ్ పై వస్తున్నా ఆరోపణలకు తన బ్యాట్ తో సమాధానమిస్తాడా లేదా.?

ADVERTISEMENT
Latest Stories