గడిచిన కొన్ని నెలలుగా స్టార్ ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులు ఢీలా పడిపోయారు. గడిచిన 12-15 నెలలలో కోహ్లీ రెండు ఐసీసీ ట్రోఫీలు, ఎప్పటినుండో ఊరిస్తున్న ఈ సాల కప్ నందే అనే ఐపీఎల్ ట్రోఫీ ను అందుకున్నా కూడా, పొట్టి ఫార్మటు మరియు టెస్ట్ ల నుండి కోహ్లీ రిటైర్మెంట్ కింగ్ అభిమానులను బాధిస్తుంది.
ఒక పక్క రెండు ఫార్మటు ల నుండి ఎలాగో తాము ఆరాధించే ఆటగాడు మైదానం లో ఇక కనపడడు అని మానసికంగా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న అభిమానులకు ఇంత లోనే 2027 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ స్థానానికి భద్రత ఉందా.? లేదా.? అనే సందేహాలు మొదలయ్యాయి.
అలాగే కోహ్లీ అప్పటి వరకు జట్టులో కొనసాగాలంటే తప్పనిసరిగా అతని బ్యాట్ నుండి పరుగులు రావాల్సిందే అనే వార్తలు అభిమానులను ఇంకాస్త దిగ్బ్రాన్తి కి గురిచేస్తున్నాయి. అలాకాకుంటే కోహ్లీ టీంలో కోహ్లీ స్థానానికి ఎసరు తప్పదని,
లేకుంటే టి – 20, టెస్ట్ ఫార్మాట్ ల మాదిరే కోహ్లీ త్వరలోనే వన్ డైలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు కూడా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీనితో విరాట్ అభిమానులు ఈ వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే ఇందులో వాస్తవం ఎంత అనేదానికన్నా ఇప్పుడే నిర్దారించలేకపోయినప్పటికీ అది క్రికెట్ అభిమానుల భావోద్వేగాలను పూర్తిగా ప్రభావితం చేస్తుంది. మరి ఇలాంటి సమయంలో కోహ్లీ తన ‘ఎక్స్’ వేదికగా “వదులుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే మీరు విఫలమవుతారు” అనే నిఘాడమైన అర్ధం వచ్చేలా ట్వీట్ చేసారు.
అలా విరాట్ కోహ్లీ ట్వీట్ చేసాడో లేదో, సోషల్ మీడియా మొత్తం ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. నిముషాల్లోనే అభిమానులంతా ఈ ట్వీట్ ను వారి వారి స్టేటస్ లో అప్లోడ్ చేస్తూ, ఈ కోహ్లీ ట్వీట్ వెనక ఏదో భారీ కారణం ఉంది, వచ్చే ఆస్ట్రేలియా సిరీస్ లో విరాట్ అసాధారణమైన ఆట చూపిస్తాడు అని ఫాన్స్ అనుకుంటూవున్నారు. కానీ, ఎక్కడో ఫ్యాన్స్ మదిలో ఒక కలవరం లేకపోలేదు.
అయితే ఈ ట్వీట్ ఎందుకు చేసాడు, అసలు కారణం ఏంటి ఫ్యాన్స్ ఆలోచిస్తున్న సమయంలో కోహ్లీ మరొక ట్వీట్ తో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. “విజయం నేర్పించలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది” అంటూ వ్రాగన్ కంపెనీ ను టాగ్ చేస్తూ ఒక కమర్షియల్ యాడ్ ను పోస్ట్ చేసాడు. ఇది చూసి అభిమానులంతా కంగుతిన్నారు.
ఈ కోహ్లీ పోస్ట్ పై ఎంతోమంది యాంటీ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు. విరాట్ తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వ్రాగన్ కంపెనీ యాడ్ ను ‘ఎక్స్’ లో పోస్ట్ చేయటం తప్పేమి కాదు గాని, ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి నిఘాడమైన అర్ధం వచ్చే కొటేషన్ ను పోస్ట్ చేసి క్రికెట్ ఫాన్స్ ను ఊరించి, తీరా అది ఒక యాడ్ అంటూ ఉసూరుమనిపించాడు అంటూ ఎవరి అభిప్రాయాన్ని వారు నెట్టింట పంచుకుంటున్నారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>The only time you truly fail, is when you decide to give up.</p>— Virat Kohli (@imVkohli) <a href=”https://twitter.com/imVkohli/status/1978680024589828498?ref_src=twsrc%5Etfw”>October 16, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>




