ఎన్నికల బరిలోకి దిగిన హీరో… ఫైర్ అయిన ‘సూపర్ స్టార్’ నిర్మాత..!

Vishal Reddy says My father begged to release his filmఇప్పటికే తమిళ నటీనటుల సంఘమైన నడిగర్ సంఘంపై విజయబావుట ఎగురవేసిన తెలుగు హీరో విశాల్… ఇప్పుడు నిర్మాతల సంఘం ఎన్నికలపై దృష్టి సారించి, ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీకి బరిలోకి దిగుతున్నాడు. దీంతో ప్రచారంలో భాగంగా… ఇప్పటి వరకు ఉన్న నిర్మాతల సంఘంపై విశాల్ తీవ్ర విమర్శలు చేశాడు. నిర్మాతల సంఘం పట్టించుకోకపోవడం వల్లే సినీ నిర్మాతగా ఉన్న తన తండ్రి నిరుపేదగా బిచ్చమెత్తుకునే స్థాయికి చేరుకున్నారని విశాల్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

ADVERTISEMENT

సినిమాలు తీయని వారు కూడా నిర్మాతల సంఘం పదవి కోసం పాకులాడటం న్యాయమేనా? అని ప్రశ్నించిన విశాల్ వ్యాఖ్యలపై నిర్మాతల సంఘం నేతలు మండిపడ్డారు. టీ-నగర్ లో ఉన్న నడిగర్ సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన పలువురు సినీ నిర్మాతలు, నడిగర్ సంఘం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ‘కబాలి’ చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను మాట్లాడుతూ, విశాల్ కు ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కోరిక కలిగినట్టుందని…అందుకే తన ఆశలను నెరవేర్చుకోవడానికి నడిగర్ సంఘాన్ని, నిర్మాతల సంఘాన్ని వాడుకోవాలని చూస్తున్నాడంటూ విమర్శించారు.

4000 మంది సభ్యులున్న నడిగర్ సంఘం మంచి చెడ్డలు వదిలేసి… 1500 మంది ఉన్న నిర్మాతల సంఘంపై విశాల్ కన్నేశాడని విమర్శించారు. విశాల్ ను హీరోగా పెట్టి కదకళి, పట్టత్తుయానై, అంబళే, సమర్, కత్తసండై సినిమాలను తీసిన నిర్మాతలు సర్వస్వం కోల్పోయారని… ముందు వారిని కాపాడాలని సూచించారు. విశాల్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారని, విశాల్ పై నడిగర్ సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి నిర్మాతల ఎన్నికల సంఘం అధ్యక్ష పదవి పోటీ కూడా వాడివేడిగా జరుగుతుండడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories