అగ్నిపరీక్ష పేరుతో ఓ ప్రముఖ తమిళ ఛానల్ కు విలక్షణ నటుడు కమలహాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూ రాజకీయ పరంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఈ ఇంటర్వ్యూలో కమల్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి ఆగ్రహం తెప్పించడంతో, కమల్ పై పళనిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ADVERTISEMENT
65 ఏళ్ల తర్వాత కమల్ కు జ్ఞానోదయం అయిందంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న యంగ్ హీరో విశాల్ సదరు వ్యవహారంపై స్పందించాడు. రాజకీయ పరంగా కమలహాసన్ కు ఎలాంటి సమస్యలు తలెత్తినా తాము ఆయనకు అండగా నిలబడతామని, ఈ సందర్భంగా కమల్ కు తాము పూర్తి మద్దతు పలుకుతున్నామని చెప్పాడు.
ADVERTISEMENT



