
కవితకు ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి కాస్త విముక్తి రావడంతో బిఆర్ఎస్ పార్టీకి కొత్తగా ఊపిరొచ్చినట్లయ్యింది. అయితే కవిత బయటకు రావడంతో బిఆర్ఎస్ పార్టీ మీద తగ్గిన ఒత్తిడిని కాంగ్రెస పార్టీ పై పెంచాలని వ్యూహాలు సిద్ధం చేస్తుంది బిఆర్ఎస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఇరుకునపెట్టడానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ చెప్పడానికి బిఆర్ఎస్ చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ‘ఓటుకు నోటు’ కేసు.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ ను నియమిస్తామని సుప్రీం కోర్ట్ తెలిపిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ కేసును తెలంగాణ నుండి భోపాల్ హై కోర్టుకు బదిలీ చేయాలంటూ బిఆర్ఎస్ పార్టీ తరువున వేసిన పిటిషన్ లో వాదనలు వినిపించింది.
అయితే ఈ బదిలీ పిటిషన్లు విచారిస్తే తమ న్యాయ అధికారుల మీద తమకే నమ్మకం లేదనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చినట్లు అవుతుందని సుప్రీం పేర్కొంది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తో పాటు గా రాష్ట్ర హోమ్ శాఖ బాధ్యతలను కూడా తన ఆధ్వర్యంలో ఉంచుకోవడంతో ఈ కేసు విచారణ పై తమకు అనుమానాలు ఉన్నాయని అందుకే ఈ కేసును తెలంగాణ నుండి బదిలీ చెయ్యాలనే డిమాండ్ ను ముందు తీసుకు రావడం జరుగుతుందని బిఆర్ఎస్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలియచేసారు.
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయంతో కేసీఆర్ కుమార్తె కవితకు బైలు రావడం జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు బిఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ని కూడా ఇరుకున పెట్టడానికి ఈ ఓటుకు నోటు కేసును తెర మీద కు తెచ్చిందని, అది కాకుండా ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా తమ అస్మదీయతుల ప్రభుత్వం ఉన్న భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలంటూ పట్టుబడడం వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యం కూడా ఇదే అంటూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ, బిఆర్ఎస్ బంధం పై మరోసారి బలమైన విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు.
ఏదిఏమైనా కాంగ్రెస్ ను బెదిరించాలన్నా, బిఆర్ఎస్ ను బయపెట్టాలన్నా, తమ చేతికి ఏమాత్రం మట్టి అంట్టించుకోకుండా కూడా పని పూర్తి చేయగలుగుతున్నారు బీజేపీ నేతలు. ఈ చదరంగంలో ఆట ఏ పార్టీ ఆడినా దానికి చెక్ పెట్టి ముగించేది మాత్రం బీజేపీ నే. కవిత బయటకొచ్చి గులాబీ వికసించినా, రేవంత్ లోపలి వెళ్లి హస్తానికి గాయమైన, కాషాయ కమలం ‘ఊ’ అనాల్సిందే అన్నట్టుగా తెర వెనుక రాజకీయాలు నడుస్తున్నాయి, నడిపిస్తున్నారు.
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.