గత కొన్ని రోజుల నుండి, మెగాస్టార్ చిరంజీవి యొక్క లూసిఫెర్ రీమేక్ నుండి వివి వినాయక్ వైదొలిగినట్లు కొన్నిఊహాగానాలు వచ్చాయి. చిరంజీవి మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండటంతో వినాయక్ మరో హీరోతో ఒరిజినల్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. అయితే వీటిలో నిజం లేదట.
దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోలేదని మరియు అతను ఈ చిత్రం చేయడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడని మాకు ఇప్పుడు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. “నేను అన్నయ్య అభిమానిని. ఆయనతో సినిమా చెయ్యాలంటే అదృష్టం ఉండాలి. అందుకోసం ఎంత టైమైనా వెయిట్ చేస్తా,” అని చెబుతున్నారట.
ఈ మలయాళ హిట్ కథకు తెలుగు టచ్ జోడించడానికి ఆయన తన రచయితల బృందంతో స్టోరీ సెషన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ – ఠాగూర్ మరియు ఖైదీ నం 150 తో విజయవంతంగా రెండు తమిళ సినిమాలను రీమేక్ చేసిన వి.వి.వినాయక్ మూడో రీమేక్ కు కూడా సిద్ధం అవుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ మొదట్లో సాహో ఫేమ్ సుజీత్‌తో ప్రారంభించబడింది, అయితే మెగాస్టార్ తన పని పట్ల నమ్మకం లేకపోవడంతో అతనిని తప్పించారు. ఈ చిత్రం 2021 ద్వితీయార్ధంలో సెట్స్ మీదకు వెళ్తుంది. 2018లో విడుదలైన సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ వినాయక్ చివరి సినిమా.





