వినాయక్ చెప్తే కానీ ఆయన గొప్పతనం తెలియలా!

vv-vinayak-talks-about-senior-director-sagarసీనియర్ దర్శకుడు సాగర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులలో ఎక్కువ మంది సాగర్ వద్ద శిక్షణ పొందిన వారే. అలాంటి వారిలో అగ్ర దర్శకుడు వివి వినాయక్ ఒకరు. తన తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ విశేషాలను తెలిపే క్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురువు గారైన సాగర్ తో ఉన్న అనుబంధాన్ని ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు వినయ్.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రోజుకు 18 నుండి 20 గంటలు కష్టపడేవాడినని, షూటింగ్ అయిపోయిన అనంతరం రచయితలతో కలిసి సన్నివేశాలు తెలుసుకుంటూ సమయం గడిపేసేవాడినని, అలాంటి సమయంలో నిద్ర పోవడానికి రోజుకు రెండు గంటలు సమయం ఉంటే చాలనుకునేవాడినని, ఒక్కో సందర్భంలో తన గురువు గారి చేయి మీద అలా తలవాల్చి పడుకుంటే, సాగర్ గారు కనీసం కదలను కూడా కదిలేవారు కాదని, తానూ కదిలితే నా నిద్ర ఎక్కడ పోతుందో అని అలాగే ఉండేవారని, అంత గొప్ప వ్యక్తి అని గర్వంగా చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఒక్కోసారి అయితే నేను రూమ్ లో మంచం మీద పడుకుంటే, ఆ తర్వాత వచ్చిన గురువు గారు దుప్పటి వేసుకుని నేల మీదే పడుకునేవారని, అప్పట్లో తానూ కేవలం అసిస్టెంట్ డైరెక్టర్, సాగర్ గారు అప్పటికే పెద్ద దర్శకులు అని ఆయన ఔన్నత్యాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు వినాయక్. ఒక్క సాగర్ గారు తప్ప అలా ఎవరూ చేయలేరేమోనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు ఈ ‘ఖైదీ’ దర్శకుడు. కష్టాల్లో ఉన్నపుడు సాయం చేసిన వ్యక్తిని మరిచిపోవడం అసాధ్యమని, బహుశా కొందరు కావాలని నటిస్తారేమో గానీ, తానూ అలాంటి వ్యక్తిని కాదని, తన గురువు గారు కూడా ‘వినయ్’ అని గౌరవంగా పిలిచేలా నేనున్నానని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories